2కే రన్‌ను ప్రారంభించి, స్వయంగా పాల్గొన్న అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్
మెదక్,అక్టోబర్,31,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా శనివారం మెదక్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. బోధన్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు రన్ కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.1875 అక్టోబర్ 31న గుజరాత్‌లో జన్మించిన పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని తెలిపారు. ఆయన దూరదృష్టి, దృఢ సంకల్పం, నాయకత్వం నేటి తరానికి ఆదర్శమన్నారు.భాష,మతం, ప్రాంతాలకు అతీతంగా భారతీయులమనే భావనతో ఐకమత్యంగా మెలగాలని, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సోదరభావాన్ని అలవర్చుకుని దేశాభివృద్ధిలోభాగస్వాములుకావాలనిపిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీఎస్పీ రంగనాథ్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్సైలు, అగ్నివీర్ అభ్యర్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


