పోలీస్ శాఖకు తీరని లోటు..ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సంతాపం
మెదక్,అక్టోబర్,19,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.విధులకు హాజరయ్యేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ ప్రసాద్ మృతి చెందడం తీవ్ర విషాదకరమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ అన్నారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మెదక్‌కు వస్తున్న సమయంలో నర్సాపూర్–మెదక్ మార్గంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం స్కిడ్ కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రసాద్ మృతి చెందారు.ప్రసాద్ మృతి పోలీస్ శాఖకు తీరని లోటని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

