-నూతన కార్యవర్గానికి బీఆర్‌ఎస్ సీనియర్ నేత అభినందనలు
-ఘనంగా సన్మానించిన సాయిరాం నగర్ కాలనీవాసులు
అమీన్‌పూర్,అక్టోబర్ 16:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీల సమగ్ర అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తాము ఎల్లవేళలా ముందుంటామని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం, నూతన కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు ఉపేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.సాయిరాం నగర్ కాలనీ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీవాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాలనీ అభివృద్ధికి నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాలనీ కమిటీకి తమ పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సాయిరాం నగర్ కాలనీ నూతన కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

