📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Homepatancheru political newsలక్షకు వినాయకుడి లడ్డు దక్కించుకున్న యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్...

లక్షకు వినాయకుడి లడ్డు దక్కించుకున్న యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

ఘనంగా కేజీఎఫ్ యువసేన వినాయక నిమజ్జనోత్సవం

అమీన్‌పూర్, సెప్టెంబర్ 20:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ డివిజన్ పరిధిలోని కేజీఎఫ్ యువసేన ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు.శోభాయాత్రకు ముందు నిర్వహించిన గణపతి లడ్డు వేలంపాట భక్తుల ఉత్సాహం మధ్య హోరాహోరీగా సాగింది. ఈ వేలంపాటలో టీపీఆర్ యువసేన యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డి అత్యధికంగా రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) పలికి గణనాథుడి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేజీఎఫ్ యువసేన ప్రతినిధులు మాట్లాడుతూ… గణపతి లడ్డూను రూ. లక్ష వెచ్చించి సొంతం చేసుకున్న యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రుశ్వంత్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో కూడా యువసేన సభ్యులంతా కలిసికట్టుగా మరిన్ని సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. అనంతరం యువకుల కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ గణనాథుడిని ఘనంగా సాగనంపారు. టిపిఆర్ యువసేన సభ్యులు తుమ్మల,దేవేందర్ రెడ్డి, కే జి ఎఫ్ యువసేన సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular