పాపన్నపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.
పాపన్నపేట,సెప్టెంబర్,17,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో వృత్తిదారులు, కార్మికులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, వడ్ల కుబేరుడు,ప్రభు భూషణ్, అశోక్, భాగేష్ కుమ్మరి, సాయిలు, రఘు, దత్తు, లక్ష్మణ్, శ్రీను, సిద్ధ రాములు,జయరాం, సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

