📄 ePaper
Wednesday, September 16, 2026
ADS
Homepatancheru political newsపీఎన్ఆర్ కాలనీ స్మశాన వాటిక వద్ద సీసీ రోడ్డు పనులకు...

పీఎన్ఆర్ కాలనీ స్మశాన వాటిక వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

📰 Generate e-Paper Clip

– కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

– పాల్గొన్న మాజీ కౌన్సిలర్ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి

అమీన్‌పూర్,సెప్టెంబర్,15:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీ పక్కన ఉన్న స్మశాన వాటిక సమీపంలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డిలతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.పీఎన్ఆర్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలు, స్మశాన వాటికకు వచ్చే వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యను పరిష్కరించేందుకు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజల మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత గుత్తేదారులను, అధికారులను ఆదేశించారు.అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు, కాలనీ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని, స్థానికుల సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినందుకు కాలనీవాసులు చైర్మన్‌కు, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దశరథ్, యాదగిరి, రామ్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular