పీఎన్ఆర్ కాలనీ స్మశాన వాటిక వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
- కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి - పాల్గొన్న మాజీ కౌన్సిలర్ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి అమీన్‌పూర్,సెప్టెంబర్,15:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీ పక్కన ఉన్న స్మశాన వాటిక సమీపంలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు....