📄 ePaper
Tuesday, November 3, 2026
ADS
Homepatancheru political newsరూ.5.50 లక్షలకు స్వాతి–సాయికుమార్ ముదిరాజ్, రూ. 1.30 లక్షలకు రాహుల్...

రూ.5.50 లక్షలకు స్వాతి–సాయికుమార్ ముదిరాజ్, రూ. 1.30 లక్షలకు రాహుల్ గణేష్ లడ్డూలు కైవసం.శ్రీ శుభం కాలనీలో ఘనంగా శోభాయాత్ర.

📰 Generate e-Paper Clip

రూ.5.50 లక్షలకు స్వాతి–సాయికుమార్ ముదిరాజ్, రూ. 1.30 లక్షలకు రాహుల్ గణేష్ లడ్డూలు కైవసం.శ్రీ శుభం కాలనీలో ఘనంగా శోభాయాత్ర

వైభవంగా 11 రోజుల గణపతి నవరాత్రి వేడుకలు

లక్కీ డ్రా విజేతలకు స్కూటీ, సైకిల్ బహుమతులు అందజేత

కాలనీ ఐక్యతకు నిదర్శనం ఈ ఉత్సవాలు: కాలనీ ప్రెసిడెంట్ సాయికుమార్ ముదిరాజ్

అమీన్‌పూర్, సెప్టెంబర్ 25(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ శుభం కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. గత 11 రోజులుగా స్వామివారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలనీవాసులంతా ఒకే కుటుంబంలా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు.శోభాయాత్రకు ముందు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఎంతో ఉత్సాహంగా సాగింది. మొదటి లడ్డూను కాలనీ ప్రెసిడెంట్ శ్రీమతి & శ్రీ స్వాతి–సాయికుమార్ ముదిరాజ్ దంపతులు రికార్డు స్థాయిలో రూ. 5,50,000/- పలికి దక్కించుకున్నారు. అలాగే రెండో లడ్డూను కాలనీకి చెందిన రాహుల్ రూ. 1,30,000/- కు సొంతం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు స్కూటీ, మరో విజేతకు సైకిల్‌ను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ సాయికుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ.గత నాలుగు సంవత్సరాలుగా కాలనీవాసులందరి సహకారంతో స్వామివారి నవరాత్రులు ఇంత వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉంది. మన కాలనీలోని ప్రతీ ఒక్కరి ఐకమత్యమే ఈ కార్యక్రమాల విజయానికి కారణం. లడ్డూ వేలంలో పాల్గొని సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా కాలనీ సంక్షేమం, అభివృద్ధికి అందరం ఇలాగే కలిసికట్టుగా కృషి చేద్దాం” అని తెలిపారు.ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు మాట్లాడుతూ.కాలనీ ప్రెసిడెంట్ సాయికుమార్ ముదిరాజ్ గారు ముందుండి అన్ని కార్యక్రమాలను నడిపిస్తున్నారని, ఆయన చేస్తున్న సేవలు కాలనీ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయని కొనియాడారు. అనంతరం కాలనీవాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లతో శోభాయాత్ర నిర్వహించి స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular