📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homecollector MEDAKరెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

📰 Generate e-Paper Clip

మెదక్,మే,4,మెదక్ న్యూస్:ప్రతినిధి,రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్,అటవీ,సివిల్ సప్లై,హౌసింగ్, రెవెన్యూ,మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని, ధాన్యాంకోనుగోలు లో లోడింగ్ ఆన్ లోడింగ్ పక్రియ త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. సాదా బైనామాలు పరిశీలించాలని, జనగణన ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం , స్వీయ గణనలో అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు.
సంక్షేమ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించాలని సభ్యత్వం పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి జోజీ, ఆర్డీవోలు తాసిల్దార్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments