రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.
మెదక్,మే,4,మెదక్ న్యూస్:ప్రతినిధి,రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్,అటవీ,సివిల్ సప్లై,హౌసింగ్, రెవెన్యూ,మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని, ధాన్యాంకోనుగోలు లో లోడింగ్ ఆన్ లోడింగ్ పక్రియ త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహ...