📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 8

గజ్వేల్ ఏసిపి కే.నర్సింలు,మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు..

0

సిద్దిపేట్, మర్కుక్, జులై 20, మెదక్ టుడే న్యూస్

గజ్వేల్ ఏసిపి కే.నర్సింలు,మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు.కె.నర్సింలు, ఏసీపీ గజ్వేల్  వార్షిక తనిఖీ నిమిత్తం మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం పరిశీలించి, స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసు ప్రాపర్టీ, స్టేషన్ ఆవరణలో ఉన్న కేసు సంబంధిత వాహనాలను,పరిశీలించారు.అదేవిధంగా, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో , మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మర్కూక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, (సీ సీ టీ ఎన్‌ ఎస్ ) తదితర విభాగాల పనితీరును సమీక్షించి, సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు.అలాగే, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు ఇతర నేరాల దర్యాప్తు విషయంలో మర్కూక్ ఎస్‌ఐ ఎస్.కె  యూనస్ అహ్మద్ అలీ,కి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసి, దర్యాప్తును నిష్పాక్షికంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీలో గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  రవి రాజు,  పాల్గొన్నారు.

5 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష..

0

సిద్దిపేట్, జులై 20, మెదక్ టుడే న్యూస్

సిద్దిపేట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులోని నిందితుడు గొర్ల రవి కుమార్(57) అనే వ్యక్తికి న్యాయస్థానం 25 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయప్రసాద్ర్ తీర్పు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 22/04/2021న కేసు నమోదు చేయడమైనది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అప్పటి అదనపు డిసిపి రామేశ్వర్, ( ఇన్చార్జి ఎసిపి సిద్దిపేట) , ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాస్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పటిష్టమైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయడమైనది. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల,ఆత్మరాములు, వాదనలు వినిపించగా, ప్రస్తుత ఇన్స్పెక్టర్ పి. మహేందర్ రెడ్డి , సాక్షాలు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి , సీడీఓ బాపురెడ్డి, భరోసా ఇన్చార్జ్ అధికారి ఇన్స్పెక్టర్ బి.దుర్గా, భరోసా లీగల్ అధికారి సౌమ్య, భరోసా సిబ్బంది సమన్వయంతో కేసు విచారణలో సహకారం అందించారని పేర్కొన్నారు.సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన  న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయ ప్రసాద్  నిందితుడిని దోషిగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్, ఐపీఎస్  అభినందించారు. సమాజంలో మహిళల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో రాజీ పడబోమని ఈ సందర్భంగా సిపి స్పష్టం చేశారు

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు..రూ.5 వేల జరిమానా.

0

నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని అభినంధించిన మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి శ్రీనివాస రావు ఐపీఎస్

మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి బేత్తయ్య (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆటోలో మోడల్ స్కూల్‌కు వెళ్లే 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2021 జనవరి 15న పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లింగంపల్లికి తీసుకెళ్లి అద్దె గదిలో ఉంచాడు. మరుసటి రోజు ఉద్యోగం చూసుకుని వస్తానని చెప్పి వెళ్లిన నిందితుడు తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత తన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలుసుకున్న బాలిక ఇంటికిచేరుకునిజరిగినవిషయాన్నివెల్లడించింది.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి పెద్ద శంకరంపేట్ ఎస్‌ఐ నరేందర్ పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఐఓ అల్లాదుర్గం సీఐ రవి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు సాక్ష్యం చెప్పడంలో సహకారం అందించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావళి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో విటోబా సమన్వయం చేయగా, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం, భరోసా సిబ్బంది మరియు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.

0

బాలికల, మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై చట్టం కఠినంగా వ్యవరిస్తుంది

పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినంధించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్

మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు చాకలి ప్రవీణ్ (21 సంవత్సరాలు)కు జిల్లా పొక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.కేసు వివరాలు వెల్లడిస్తూ.నిందితుడు చకలి ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాని ఫలితంగా బాధిత బాలిక గర్భం దాల్చింది. తన మేనత్త వద్ద ఉంటూ చదువుకుంటున్న బాలికను, ఆమె స్నానం చేస్తున్న సమయంలో కడుపు ఎత్తుగా కనిపించడంతో అనుమానం వచ్చిన మేనత్త ప్రశ్నించగా, నిందితుడు ఇంట్లోకి వచ్చి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఏఎస్సై డి. విఠల్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి దర్యాప్తు అధికారులు, మెదక్ రూరల్ సీఐ పలవెల్లి, అప్పటి మెదక్ డియస్పి కృష్ణ మూర్తి కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు సాక్ష్యం చెప్పే విషయంలో అవసరమైన సహకారం అందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పొక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో లైజనింగ్ అధికారి ఎస్సై విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో గౌస్ కేసు లో సహకరించారు. ఈ కేసులో శిక్ష పడేవిధంగా కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ,బాలికలు, మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల చట్టం ఎలాంటి ఉపేక్ష చూపదని, పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో మెదక్ జిల్లా పోలీసులు వేగవంతమైన, శాస్త్రీయ దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారులపై ఎలాంటి లైంగిక వేధింపులు, దాడులు లేదా దుర్వినియోగం జరిగినా భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్-100, డయల్-112 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బాధిత చిన్నారులకు చట్టపరమైన, వైద్యపరమైన మరియు మానసిక సహాయాన్ని అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు మెదక్ జిల్లా ఎస్పీ.

0

పారదర్శకంగా విచారణ చేపట్టాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు

మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని పరిశీలించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేశారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

మెదక్ కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ.

0

మెదక్ కలెక్టరేట్ ప్రజావాణి హెల్ప్ డెస్క్ కు
వినతుల వెల్లువ.

వివిధ సమస్యలపై ప్రజల నుండి 85 దరఖాస్తుల స్వీకరణ,

మెదక్ కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ.

మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

సోమవారం ఉమ్మడి జిల్లా ఎల్ -నినో ప్రభావం మంత్రివర్యుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులు సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల హెల్ప్ డేస్ ద్వారా ప్రజావాణి నిర్వహించి ప్రజలు వద్ద నుండి85 స్వీకరించి దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని సమస్యలు పరిష్కార దిశగా. కృషి చేస్తున్నట్లు హెల్ప్ డెస్క్ సిబ్బంది తెలిపారు.

ఎల్ -నినో ప్రభావం మెదక్ జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహణ తీరు బెష్ మంత్రి వివేక్ వెంకటస్వామి.

0

ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు గ్రామ గ్రామానా అవగాహన

సంగారెడ్డి జిల్లా,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి- మెదక్ జిల్లా సమీక్ష సమావేశంతెలంగాణ రాష్ట్రానికి కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖల మంత్రి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులఅధ్యక్షతన జరిగింది. ,టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి ,మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి వాణి ప్రసాద్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పత్రిక్ జైన్ , మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, ,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్యే నారాయణఖేడ్ సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ఎమ్మెల్యే సంగారెడ్డి చింత ప్రభాకర్ , సబ్ కలెక్టర్ నారాయణఖేడ్ ఉమా హారతి అదనపు ఎస్పీ సంగారెడ్డి చైతన్య ఇది జిల్లాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని.ఈ పరిస్థితుల్లో రైతాంగం,ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం చేస్తున్నట్లు.అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటల వైపే దృష్టి సారించాలన్నారు వ్యవసాయ ఉద్యాన వన అధికారుల సమన్వయంతో
అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.ప్రతి రైతుకు భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,రైతులకు ఎల్
నీ .నో పై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు కోతుల బెడద ఎక్కువగా ఉండటంవల్ల వాటి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పంట నష్టం జరిగిన రైతులకు, నష్టపోయిన రైతులకు, కొంత నష్ట పరిహారం చెల్లించాలన్నారు.25 వేల రూపాయలు ఎకరానికి అందించే విషయాన్ని కేబినెట్లో చర్చించాలన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. సింగూరు డ్యాం మరమ్మతుల కోసం అన్ని నీటిని విడుదల చేయడం జరిగిందని, ఎనిమిది టిఎంసిలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులను, త్రాగునీటిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీడియాపై ఆంక్షలా..? డిపిఅర్ఓ తీరుపై తీవ్ర విమర్శలు!

0
Oplus_16908288

15 నిమిషాల్లో సభా ప్రాంగణం ఖాళీ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు.. సమాచార సేకరణ హక్కుకు విఘాతం అంటూ మీడియా వర్గాల ఆవేదన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (మెదక్ టుడే న్యూస్):
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా మీడియా కవరేజీకి సంబంధించిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జిల్లా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కార్యక్రమం ప్రారంభానికి ముందే కేవలం 15 నిమిషాల్లో చిత్రీకరణ పూర్తి చేసి సభా ప్రాంగణాన్ని విడిచిపెట్టాలని సంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఅర్ఓ) మౌఖికంగా సూచించినట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి సమాచారాన్ని చేరవేయడం మీడియా బాధ్యత కాగా, ఇలాంటి పరిమితులు ఎందుకు విధించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆదేశాలపై వివరణ కోరగా, “అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌ను అడగండి” అని డిపిఅర్ఓ సమాధానం ఇచ్చినట్లు అక్కడున్న మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.
అధికారిక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చిత్రీకరించి ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం మీడియా విధి అని, మౌఖిక ఆదేశాల ద్వారా సమయ పరిమితులు విధించడం సమాచార సేకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకతకు భంగం కలిగే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు.
డిపిఅర్ఓ తీరుపై ప్రశ్నలు
జిల్లా అధికారిక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లపై క్రమశిక్షణ పేరుతో పరిమితులు విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటి?
ఇప్పటివరకు ఏవైనా వ్రాతపూర్వక హెచ్చరికలు జారీ చేశారా?
క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లయితే వాటి వివరాలు ఏమిటి?
మౌఖిక ఆదేశాలకే పరిమితం కావడానికి కారణమేంటి?
మీడియాపై పరిమితులు విధించేందుకు అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా?
నిజంగా క్రమశిక్షణా లోపాలు జరిగి ఉంటే సంబంధిత రికార్డులు, తేదీలు, చర్యల వివరాలను అధికారికంగా వెల్లడించాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఒక వృత్తి వర్గం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాచార సేకరణకు అనుకూల వాతావరణం కల్పించడం, పారదర్శకతను పాటించడం, మీడియాతో సమన్వయంతో వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరమని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం అధికారికంగా స్పందించి స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

రైతులకు మరో అవకాశం.జూలై 31 వరకు రైతు భరోసా’ దరఖాస్తుల స్వీకరణ.

0

పాపన్నపేట,జూలై,20,(మెదక్ టుడే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వానాకాలం 2026-27కు సంబంధించిన కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల సవరణ కోసం ఈ నెల 31వ తేదీ వరకు మరో అవకాశం కల్పించింది.
2026 జూన్ 15వ తేదీ వరకు కొత్త భూ పట్టా పాసుబుక్ పొందిన రైతులు, అలాగే ఇప్పటి వరకు భూ పట్టా పాసుబుక్ ఉన్నప్పటికీ ‘రైతు భరోసా’ పథకం ప్రయోజనం పొందని అర్హులైన రైతులు తమ బ్యాంకు వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పాపన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రాజు తెలిపారు.అనంతరంమాట్లాడుతూ,దరఖాస్తు చేసుకునే రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, భూ పట్టా పాసుబుక్ ( పిపిబి) కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్ చెక్, మొబైల్ నంబర్‌తో పాటు సంబంధిత రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి ( ఏ ఈ ఓ)ను సంప్రదించాలని సూచించారు.అలాగే, ఇప్పటికే ‘రైతు భరోసా’ పథకంలో నమోదైన రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను మార్చుకోవాల్సి ఉంటే, ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ( ఏఈఓ)ని సంప్రదించి అవసరమైన పత్రాలతో మార్పులు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీ జూలై 31లోపు దరఖాస్తులు సమర్పించి ‘రైతు భరోసా’ పథకం ప్రయోజనాలను పొందాలని ప్రజలను కోరారు.

శిథిలావస్థకు చేరిన మిరుదొడ్డి మండల్ బస్టాండ్..

0

సిద్దిపేట్, జులై 20, మెదక్ టుడే, న్యూస్

మిరుదొడ్డి మండల్ పరిధిలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ఏ సమయంలో కూలిపోతుందో ఏమోనని అధికారులు పట్టించుకోని భవనాన్ని ప్యాచ్ వర్క్స్ చేయించి కొత్తగా మార్చాలని గ్రామస్థులు తెలిపారు. బస్టాప్ లో చిన్నలు పెద్దలు కూర్చుంటారు. అని మిడిదొడ్డి గ్రామ ప్రజలు తెలిపారు.అధికారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.