📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaనేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు-అప్రమత్తంగా ఉండాలని నిపుణుల...

నేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు-అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!

📰 Generate e-Paper Clip

(స్టేట్ బ్యూరో)మే,25,మెదక్ టుడే న్యూస్:నేటి (మే 25) నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ వరకు కొనసాగే ఈ కార్తె కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, తీవ్ర అలసట, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజంతా తరచుగా నీరు తాగాలని, కేవలం దాహం వేసినప్పుడే కాకుండా మధ్యమధ్యలో పానీయాలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని, లేత రంగు కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం మరియు ఓఆర్‌ఎస్ (ORS) పానీయాలు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పుచ్చకాయ, దోసకాయ, ఖర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular