📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 7

పాపన్నపేట మండలంలో నిబంధనలకు తూట్లు..రోడ్లను చీల్చేస్తున్న కేజీ వీల్స్

0

రోడ్లపై కేజీ వీల్స్ రాజ్యం..! ప్రజల ప్రాణాలు గాల్లో.. అధికారులు నిద్రలో..!

పాపన్నపేట,జూలై,22, (మెదక్ టుడే న్యూస్)

పాపన్నపేట మండలంలోని గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లకు అమర్చిన కేజీ వీల్స్ (ఇనుప చక్రాలు) యథేచ్ఛగా తిరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాల్లో మాత్రమే వినియోగించాల్సిన ఈ ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు రహదారులపై నిర్భయంగా సంచరిస్తుండటంతో రోడ్లు వేగంగా దెబ్బతింటున్నాయి.
ఇప్పటికే వర్షాలతో గుంతలమయంగా మారిన రహదారులు, కేజీ వీల్స్ సంచారంతో మరింత అధ్వానంగా మారుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది.
స్థానికుల కథనం ప్రకారం, మండలంలోని పలు గ్రామాల్లో ఈ కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లు బహిరంగంగానే రోడ్లపై తిరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారులను కాపాడాల్సిన యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ప్రాణ భద్రత కంటే నిర్లక్ష్యమే ముఖ్యమా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రోడ్లపై కేజీ వీల్స్‌తో ట్రాక్టర్ల సంచారాన్ని నిషేధించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్&బీ శాఖ, పోలీసు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి,రోడ్డెక్కాలంటేనే భయం!

0

నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి అధ్వానంగా.. నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు వర్షం పడితే గుంతల్లో నీరు.. చిత్తడిగా మారుతున్న రోడ్డు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం,
మెదక్ టుడే న్యూస్ జులై 22 మెదక్ జిల్లారిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం నార్సింగి నుంచి పెద్ద శంకరంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి ఉండటంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరి రహదారి మొత్తం చిత్తడిగా మారడంతో రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయి.ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ నార్సింగి, పెద్ద శంకరంపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. రహదారి మొత్తం బురదమయంగా మారడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని, చిన్నపాటి వర్షానికే ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, గర్భిణులు, వృద్ధులు కూడా ఈ రహదారి పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించాలి
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలను పూడ్చడంతో పాటు రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి అధ్వానంగా..వర్షం వస్తే ప్రజలకు నరకయాతన”

0

రహదారి దుస్థితి..వర్షం వస్తే ప్రయాణం నరకప్రాయం
పాపన్నపేట,జూలై,22, (మెదక్ టుడే న్యూస్)
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నార్సింగి–పెద్ద శంకరంపేట ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షం పడినప్పుడు ఆ గుంతల్లో నీరు నిలిచి రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో వాహనదారులు రహదారిపై ప్రయాణించడానికి భయపడుతున్నారు.ఈ రహదారిపై ప్రతిరోజూ నార్సింగి, పెద్ద శంకరంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. అయితే గుంతలు ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడుతున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం చిత్తడిగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, గర్భిణులు, వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి,
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలను పూడ్చి, రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నీట్ పరీక్షల విశ్వసనీయతపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి.

0

విద్యార్థుల ఆందోళనలపై బలప్రయోగం తగదు: తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,జులై,21,మెదక్ టుడే న్యూస్:నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించి, దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా, వారి ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.ఈ సందర్భంగా న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత అత్యంత కీలకమని అన్నారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పరీక్షల నిష్పక్షపాత నిర్వహణ, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ యువతకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే ఈ ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

విద్యుత్ షాక్ తోవ్యక్తిమృతి.

0
Oplus_16908288

పాపన్నపేట,జూలై,21,(మెదక్ టుడే న్యూస్)

పాపన్నపేటమండలపరిధిలోనిపొడ్చెన్‌పల్లి గ్రామంలోమంగళవారం ఉదయంవిషాదకరసంఘటనచోటుచేసుకుంది.ఇంటివద్దసంపునుంచిట్యాంక్‌కునీటినిఎక్కించేప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై గ్రామ సర్పంచ్ వెంకటయ్య(ఏసు)తండ్రిఏరోళ్లకిష్టయ్య(56)మృతిచెందారు.పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏరోళ్లకిష్టయ్యమంగళవారం ఉదయంఇంటివద్దఉన్నసంపునుంచిమోటారు.ద్వారాఇంటిపైఉన్నట్యాంక్‌కునీటినిఎక్కించేప్రయత్నంచేస్తుండగా, వర్షంకారణంగా తడివాతావరణంలోప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.ఈ విషయం గమనించిన కుటుంబికులు వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా,పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బంది తో సంఘటనా స్థలానికిచేరుకునిపరిశీలించి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంమెదక్ఏరియాఆస్పత్రికితరలించి, కుటింబికుల పిర్యాదుమేరకుకేసునమోదుచేసిదర్యాప్తుచేపట్టారు.కాగామృతుడికిభార్యకమలమ్మ,వివాహంఅయినఇరువురు కుమార్తెలు, స్థానిక సర్పంచ్ ఏసు కుమారుడు ఉన్నారు.

కుర్తివాడలో అక్రమ ఇసుక నిల్వలు గుర్తింపు–154 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్.

0

పాపన్నపేట,జూలై,21,(మెదక్ టుడే న్యూస్)

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏడీ మైన్స్, ఆర్‌ఐ-ఏడీ మైన్స్ పాపన్నపేట రెవిన్యూ అధికారులు పోలీసు సిబ్బంది సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గ్రామంలోని 29 వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను గుర్తించారు.మొత్తం 154 ట్రాక్టర్ ట్రిప్పులకు సమానమైన ఇసుక అక్రమంగా నిల్వ చేసినట్లు ఏడీ మైన్స్ అధికారులు అంచనా వేశారు.గుర్తించిన ఇసుకను అధికారులు సీజ్ చేసి, కుర్తివాడ గ్రామ పాలనాధికారి(జీపీవో) ఆధీనంలో ఉంచారు. అక్రమ ఇసుక నిల్వలపై తదుపరి చర్యలు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం చేపడతామని అధికారులు తెలిపారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

0

మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అన్ని జిల్లాలలో వేగవంతంగా పూర్తి చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలని తెలిపారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించి త్వరితగతిన ఆన్లైన్ పూర్తి చేయాలని తెలిపారు.అందిన ఫారాలు, దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ,భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యువరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను 83 % శాతం పూర్తి చేశామని, నిర్ణీత వ్యవధిలోనే అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తామని తెలిపారు. గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేసే విధంగా చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో మెదక్ ఆర్డీవో రమాదేవి,నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ , ఎన్నికల సూపర్డెంట్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

0

సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

– జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్

మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి, వివిధ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (వీపీఓలు) తమ పరిధిలోని గ్రామాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ లింకుల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతంగా చేపట్టాలని ఎస్పీ సూచించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా వ్యాపారులు, దుకాణ యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించేందుకు, నేరాల దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖకు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు రంజిత్ రెడ్డి, జగన్మోహన్, కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో యువకుడికి ఏడాది జైలు.

0

రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు

చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

సోషల్‌ మీడియాలో చట్టవిరుద్ధ కంటెంట్‌ ప్రచారం చేస్తే కఠిన చర్యలు

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్

మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్‌ చేయడం, సర్క్యులేట్‌ చేయడం వంటి నేరాలకు పాల్పడిన తూప్రాన్‌కు చెందిన అరిగే శివకుమార్‌ (20) కు పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.తూప్రాన్‌ పట్టణానికి చెందిన శివకుమార్‌ డిగ్రీ చదువుతున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్‌ చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు అతడి ఫోన్‌ను పరిశీలించగా, ఒక వ్యక్తి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సృష్టించి ఇతరులకు అశ్లీల కంటెంట్‌ను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్‌ క్రైమ్‌ విభాగం సహకారంతో ఐపీ అడ్రస్‌, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. తూప్రాన్‌ ఎస్‌ఐ శివానందం 12 మే 2026 న కేసు నమోదు చేయగా, అప్పటి ఐఓ, తూప్రాన్‌ సీఐ రంగకృష్ణ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలయ్య వాదనలు వినిపించారు.సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి సుభావాలి నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో లైజనింగ్‌ అధికారులు ఎస్‌ఐ విఠల్‌, కానిస్టేబుల్‌ కృష్ణ, సీడీఓ నాగరాజు సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూడడం, కలిగి ఉండడం, షేర్‌ చేయడం, సర్క్యులేట్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రచారం చేసే వారిని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు.చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.

మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్.

0

అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు:

ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్
తప్పుగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినా చర్యలు –

ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు

మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మెదక్ జిల్లా పరిధిలోని పలు మీ సేవ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన (ఎస్ ఎస్ సి) మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, వ్యవసాయేతర మార్కెట్ విలువ తదితర సేవలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని,తప్పుగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే సంబంధిత ఆపరేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.కులం,ఆదాయం, నివాసం, జనన, మరణం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ, గ్యాప్, నాన్-క్రీమీ లేయర్ వంటి సర్టిఫికెట్లను అవసరమైనన్ని సార్లు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవ కేంద్రాలు పనిచేయాలని, ఆపరేటర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవ, భూభారతి సహా అన్ని ఆన్‌లైన్ సేవలను సమర్థంగా అందించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సిటిజన్ చార్టర్, భూభారతి ఫ్లెక్సీలు, మీ సేవ లోగోతో పాటు తహసీల్దార్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పరిష్కారం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.కళ్యాణలక్ష్మి,యూడీఐడీ (సదరం), జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు.ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని ఆపరేటర్లకు సూచించారు.నిర్ణీత ప్రభుత్వ రుసుము కంటే అధికంగా వసూలు చేసినట్లు తేలితే సంబంధిత మీ సేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు పూర్తి ఆన్‌లైన్, కాగిత రహిత విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.గ్రామ పాలనాధికారులు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయని,దరఖాస్తుల స్వీకరణ నుంచి తహసీల్దార్ ఆమోదం వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందని వివరించారు.కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు డిజిటల్ రశీదు (ఎస్ఎంఎస్) అందుతుందని తెలిపారు. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, రశీదు డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైపర్‌లింక్ ఉంటుందని చెప్పారు.ఆ లింక్ ద్వారా రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు.ఈడిజిటల్ విధానం వల్ల కాగితపు రశీదులు పోగొట్టుకునే సమస్య ఉండదని, అవసరమైతే అదే సందేశాన్ని మళ్లీ పంపించుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ వెల్లడించారు.ఈతనిఖీల్లో పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.