📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaఒరిజినల్ భూమి పత్రాలు పోగొట్టుకున్నారు: ఆచూకీ దొరికితే తెలపాలని విజ్ఞప్తి.

ఒరిజినల్ భూమి పత్రాలు పోగొట్టుకున్నారు: ఆచూకీ దొరికితే తెలపాలని విజ్ఞప్తి.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, వెల్దుర్తి గ్రామానికి చెందిన కిష్టం రంగయ్య (తండ్రి బాల నరసయ్య) చేగుంట మండల కేంద్రంలో తన భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు (ల్యాండ్ డాక్యుమెంట్స్) పోగొట్టుకున్నట్లు తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆయన వెల్దుర్తి నుండి చేగుంటకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. చేగుంటలో దిగిన తర్వాత ఇక్కడి ఒక జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి తన బ్యాగును పరిశీలించగా అందులో ఉండవలసిన ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న పత్రం చేగుంట గ్రామంలోని ఎన్జీవోస్ కాలనీకి సంబంధించిన స్థలం డాక్యుమెంట్ అని, దాని ఒరిజినల్ డాక్యుమెంట్ నెంబర్: 863/98 అని బాధితుడు రంగయ్య ఆవేదనతో తెలిపారు. కావున ప్రయాణికులు లేదా స్థానికులకు ఎవరికైనా ఈ నెంబర్ గల ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్ లభించినట్లయితే, మానవతా దృక్పథంతో కింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు సంప్రదించి సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు 9394571393, 9666950677, 9010360853.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular