📄 ePaper
Friday, May 15, 2026
ADS
HomeNewsస్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

📰 Generate e-Paper Clip

•స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

•జిల్లా ఎస్ పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

స్పెషల్ లోక్-అదాలత్ కార్యక్రమం లో భాగంగా, మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 503 కేసులను లోక్-అదాలత్‌లో సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ, పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి కేసులను పరిష్కరించుకోవడం జరిగింది.ప్రత్యేకంగా సైబర్ నేరాలకు సంబంధించిన 41 కేసుల్లో, బాధితులు కోల్పోయిన రూ. 11,44,608/- మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయునట్లు సంబంధిత బ్యాంకుల నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ అనేది క్షణికావేశంలో జరిగే చిన్నపాటి వివాదాలు, గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకునే అద్భుత వేదిక. కోర్టుల్లో సంవత్సరాల తరబడి నిలిచే కేసులను ఇరు వర్గాల రాజీ ద్వారా పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. రాజీ మార్గమే రాజమార్గం అనే భావన ప్రతి ఒక్కరిలో పెరగాలని అన్నారు.జిల్లాలో లోక్-అదాలత్ విజయవంతం కావడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ సిబ్బందిని ఎస్ పి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments