📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Homepatancheru political newsదశాబ్ద కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాం-నందారం నరసింహ...

దశాబ్ద కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాం-నందారం నరసింహ గౌడ్.

📰 Generate e-Paper Clip

అమీన్పూర్,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ దార్శనికతతోనే ప్రగతి సాధ్యమైంది:“నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో, గత దశాబ్ద కాలంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆనాడు కరవు, కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం, నేడు కేసీఆర్ గారి కృషితో దేశానికే అన్నపూర్ణగా, అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పల్లె ప్రగతి నుండి పట్టణ ప్రగతి వరకు ప్రతి అడుగులోనూ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పరిపాలన సాగించాం” అని ఆయన పేర్కొన్నారు.అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు:ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన మన పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయి. అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గతంలో మేము చేసిన కృషి నేడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది” అని నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, కొల్లూరు మల్లేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, ఉపేందర్ రెడ్డి, జగదీష్, కొల్లూరు గోపాల్ , ప్రమోదర్ రెడ్డి, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, దాసు యాదవ్,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular