దశాబ్ద కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాం-నందారం నరసింహ గౌడ్.
అమీన్పూర్,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ దార్శనికతతోనే ప్రగతి సాధ్యమైంది:"నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన తెలంగాణ తొలి...