•బుద్ధ విహార్ ప్రాంగణంలో తొలిసారిగా జాడే పరివార్ పెళ్లి
•బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలి -బైంసా బుద్దావిహార్ కమిటీ సభ్యులు.
లోకేశ్వరం,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:
భైంసా: పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి) ప్రాంగణంలో మెట్ట మొదటిసారిగా నిగ్వ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుడు, ప్రశ్నించే గొంతు జాడే లక్ష్మణ్ తో,దేగాం గ్రామానికి చెందిన పుగ్లె విద్యషిలకు ఈ నెల 13న వివాహం జరిగింది.ఈ బుద్ధ విహార్ లో మొట్ట మొదటి పెళ్ళికాగ,ఈ సందర్భంగా బుద్ధ విహార్ నిర్మాణం కొరకు రూ.10 వేలు విరాళంగా విహార్ టీం సభ్యులకు ఆదివారం అందచేశారు.దీంతో విహార్ టీం సభ్యులు నూతన వధూవరులకు బుద్ధుడు,అంబేద్కర్, చిత్రపటాలు అందచేసి జై భీమ్ లు తెలియజేశారు. అలాగే ఈ అవకాశం కల్పించిన బుద్ధ విహార్ కమిటి సభ్యులకు జాడే లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, మరియు పుగ్లె పరివార్ కుటుంబ సభ్యులు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ కమిటీ, నూతన వధూవరుల దంపతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
