📄 ePaper
Tuesday, November 3, 2026
ADS
Homepatancheru political newsఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం:వేలంపాటలో రూ.70 వేలకు సిల్వర్ కాయిన్...

ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం:వేలంపాటలో రూ.70 వేలకు సిల్వర్ కాయిన్ కైవసం.

📰 Generate e-Paper Clip

ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం: వేలంపాటలో రూ. 70 వేలకు సిల్వర్ కాయిన్ కైవసం

• దక్కించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీకాంత్ యాదవ్

• శాలువాతో ఘనంగా సత్కరించిన ఉత్సవ కమిటీ సభ్యులు

అమీన్ పూర్ సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ డివిజన్ శివాలయం చౌరస్తా వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా స్వామివారి వద్ద నిష్ఠతో పూజించిన సిల్వర్ కాయిన్ల వేలంపాటను నిర్వహించారు.ఈ వేలంపాటలో అమీన్‌పూర్ డివిజన్ (271) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీకాంత్ యాదవ్ మొదటి సిల్వర్ కాయిన్‌ను అత్యధికంగా రూ. 70,000 చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకాంత్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, సిల్వర్ కాయిన్‌ను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, అమీన్‌పూర్ డివిజన్ 271 ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అలాగే తమ స్వగ్రామమైన సుల్తాన్‌పూర్ కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన వినాయకుడి వెండి నాణేన్ని దక్కించుకోవడం తనకు అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని, ఆ విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular