చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాం లో భాగంగా చేగుంట మక్క రాజుపేట చెందాయిపేట్ ఇబ్రహీంపూర్ బోనాల క్లస్టర్ పరిధిలోగల రైతు వేదికలలో రైతు వారోత్సవాల భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి చేగుంట రైతు వేదికలో రైతులతో మాట్లాడుతూ నేల ఆరోగ్య సంరక్షణను ఎలా చేసుకోవాలో మట్టి నమూనాలను మన పొలం నుండి ఎలా తీసుకోవాలో వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏవో హరిప్రసాద్, మాట్లాడుతూ మట్టి పరీక్షలను చేసుకోవడం ద్వారా మన నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నవో తెలుసుకోవచ్చని దానికి అనుగుణంగా ఏ పంటకు ఎంత ఎరువులు వేసుకోవాలని తెలుస్తుంది అని వివరించారు అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి నివేదిక లో భాగంగా సేకరించినటువంటి మట్టి నమూనా పరీక్షా ఫలితాలను రైతులకు అందజేయడం జరిగింది. ఇదే కాకుండా సమగ్ర ఎరువుల యజమాన్యం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా కలిగే లాభాలను వివరించడం జరిగింది. వచ్చే వానాకాలంలో అనుకూలమైన వరి రకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నానో యూరియా నానో డిఏపి నానో ఎంఓపి గురించి వివరించడం జరిగింది. మరియు వరి విత్తనాల మొలక శాతాన్ని ఎలా చేయాలో చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా విత్తన శుద్ధి ఎలా చేయాలో చేసి చూపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ శివ ప్రసాద్ , ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏవో హరిప్రసాద్, ఈవో వెంకటేష్, ఉల్లి , తిమ్మాయపల్లి సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు, లక్ష్మీ, చేగుంట వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
చేగుంట రైతు వేదిక లో ఘనంగా రైతు వార్షికోత్సవాలు.
RELATED ARTICLES
