చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాం లో భాగంగా చేగుంట మక్కరాజపేట, చందాయిపేట, ఇబ్రహీంపూర్,బోనాల, క్లస్టర్ పరిధిలోగల రైతు వేదికలలో రైతు వారోత్సవాల భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చందాయిపేట్ క్లస్టర్ వ్యవసాయ అధికారి భువనేశ్వరి రైతు వేదికలో రైతులతో మాట్లాడుతూ నేల ఆరోగ్య సంరక్షణను ఎలా చేసుకోవాలో మట్టి నమూనాలను మన పొలం నుండి ఎలా తీసుకోవాలి,మట్టి పరీక్షలను చేసుకోవడం ద్వారా మన నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నవో తెలుసుకోవచ్చని దానికి అనుగుణంగా ఏ పంటకు ఎంత ఎరువులు వేసుకోవాలని తెలుస్తుంది అని వివరించారు అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి నివేదిక లో భాగంగా సేకరించినటువంటి మట్టి నమూనా పరీక్షా ఫలితాలను రైతులకు అందజేయడం జరిగింది. ఇదే కాకుండా సమగ్ర ఎరువుల యజమాన్యం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా కలిగే లాభాలను వివరించడం జరిగింది. వచ్చే వానాకాలంలో అనుకూలమైన వరి రకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నానో యూరియా నానో డిఏపి నానో ఎంఓపి గురించి వివరించడం జరిగింది. మరియు వరి విత్తనాల మొలక శాతాన్ని ఎలా చేయాలో చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా విత్తన శుద్ధి ఎలా చేయాలో చేసి చూపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచులు తాలూకా మహేశ్వరీ సాయిబాబా, కసాన్ పల్లి.సర్పంచ్ బిక్య నాయక్, ఉప సర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా, మల్ల రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, రైతులు రామ గౌడ్, అవుబోతు మల్లేష్,సత్తయ్య,రైతులు ఆనందాస్ ఆంజనేయులు, బాసరాజు, సాయిబాబా, శోభన్, రమేష్, అవుబోతు ఎర్ర బాలు హరీష్. రమేష్, బల్ నర్సయ్య, రాజు, పాల్గొన్నారు

