📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధి నామాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.ఏఎస్సై దేవిదాస్ పవర్ కథనం మేరకు.గ్రామానికి చెందిన గనాజిగారి నర్సింలు(49) వ్యవసాయం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు.పొలం వద్ద పనుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు.పొలంలో అడవి పందుల కోసం రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటు తీగకు తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో సమీపంలో ఉన్న పొలాల వద్ద ఉన్న స్థానికులకు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెంది ఉన్నాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments