పాపన్నపేట,జూలై 17, (మెదక్ టుడే న్యూస్)
ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కోనగా చికిత్స పొందుతు వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్,కుటింబీకుల సమాచారం మేరకు వివరాలు .. కొత్తపల్లి గ్రామానికి చెందిన బ్యాగారి దుర్గయ్య (75) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగితున్నాడు.గత మంగళవారం ఎల్లపూర్ లో పని ఉందని ద్విచక్రవాహనం మొపేడ్ పై న్యత వెంకటేశం ను తీసుకొని వెళ్లి ఎల్లాపూర్ లో పని ముగించుకొని తిరిగి స్వ గ్రామమైన కొత్తపల్లి వస్తున్న క్రమంలో శానాయిపల్లి గ్రామ శివారులో వెనుకనుండి అతి వేగంగా వచ్చిన టిప్పర్ టి ఎస్ 08యు జె 9679 గల టిప్పర్ లారీ వీరి వాహనాన్ని ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108వాహనం, పోలీసులకు సమాచారం అందివ్వడంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా దుర్గయ్య పరిస్థితి విషమంగా ఉండడం తో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

