📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homeక్రైమ్ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య…

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య…

📰 Generate e-Paper Clip

•ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య…

పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్:

మనస్తాపంతో ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు…గ్రామానికి చెందిన గడ్డమీది ఉమామహేశ్వర్(23) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇతనికి భార్య దీపికతో గత కొన్ని రోజులుగా సంసార విషయంలో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అనంతరం ఇంట్లో నుండి మనస్తాపంతో బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు మంగళవారం ఉదయం గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular