📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 78

ఏడుపాయల వనదుర్గమ్మ దివ్యదర్శనం..

0

పాపన్నపేట, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

12/11/2025 బుధవారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ..

వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ

0

AP, ( స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

•వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విజయవాడ(బెజవాడ )రెండోప్రధాన నగరం.ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది.ఈ నగరానికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం,ఉత్తరం సరిహద్దుగా బుడమేరు సరస్సు ఉంది.భౌగోళికంగా తూర్పు కనుమలలో భాగమైన చిన్న కొండలు మధ్య విజయవాడ విస్తరించి ఉంది.ప్రకాశం బ్యారేజి దక్షిణాన బకింహాం కాలువ ఉంది.ఇది ఒకప్పుడు జలరవాణా మార్గంగా విలసిల్లింది.నగరం మధ్యలోంచి మూడు కాలువలు బందరు,ఏలూరు,రైవిస్ కాలువలు ప్రవహిస్తున్నాయి.నదీపరివాహక ప్రాంతం సారవంతమైన నేల కావడంతో ఈ కాలువలు సాగునీరు అందిస్తున్నాయి.వర్షపాతం నైరుతీ,ఈశాన్య రుతుపవనాల నుంచి లభిస్తుంది.ఏడాదిలో ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.నగరానికి పశ్చిమాన కొండపల్లిరిజర్వ్ అడవులు ఉన్నాయి.1871లో బెజవాడ జనాభా 8206, 2011లో 14,91,202 మంది కాగా 2025 లో 2.35 మిలియన్ల గా పెరిగింది.భారతదేశంలో ప్రధాన రైల్వే జంక్షన్ గా మారింది.నేడు విజయవాడ రాష్ట్రానికీ ఆర్ధిక,రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది.విజయవాడకు కనకదుర్గమ్మ (విజయ )నుంచి విజయవాటికగా పేరు వచ్చింది.కాలక్రమేణా విజయవాడ గా మారింది.విజయవాడ అన్న పేరు ఇటీవలే ప్రాచుర్యం చెందింది.పూర్వం నుంచి బెజవాడ అని పిలిచేవారు.యుద్ధమల్లుని శాసనాలలో,కొండవీడు శాసనంలో ఈ ప్రాంతాన్ని బెజవాడగా ప్రస్తావించారు. ఈ రెండు పేర్ల వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.విపరీతమైన ఎండలు ఈ ప్రాంతంలో ఉండడంతో బ్లేజువాడగా పేరు పొందింది.బ్రిటీష్ వారు రాకముందే బెజవాడ పేరు శాసనాలలో కనిపించడం గమనార్హం.విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి బెజవాడకు బ్లేజువాడగా చమత్కరించడం వల్ల అది ప్రచారంలో వచ్చిందని మరో కధనం.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసాడు.కిరాతరూపంలోని శివుడితో పోరాడాడని చెప్పే పురాణం కథ ఇది.విజయుడనే అర్జునుడి పేరుమీదే విజయవాడ గా వచ్చింది.పాశుపతాస్త్రం ఇక్కడే అర్జునుడు సాధించాడని పురాణ కథ.స్థల పురాణం వివరించే ఒక శాసనంలో ఈప్రాంతాన్ని వెచ్చవాడగా వ్యవహరించారు.జలమార్గం,భూమార్గం గా ప్రాచీనకాలం నుంచి కీలకమైన వాణిజ్య కూడలిగా ప్రసిద్ధిచెందింది.వెచ్చాలు అధికంగా లభించే చోటు కావడం తో వెచ్చవాడగా ప్రజలు నోళ్లలో నానుడి గా మారింది.అలాగే బీజవాటిక,బీజపురి,బెజ్జం వాడ,చోళరాజేంద్రపురం,అర్జునపురి వంటి పేర్లు కూడా ఉన్నాయి.
ఇక్కడి గుహలు విజయవాడ చరిత్రకు ప్రధాన సూచికలు. విజయవాడ లో హిందువులు 85 శాతం ఉన్నారు.ముస్లింలు వన్ టౌన్ తదితర ప్రాంతంలో 10 శాతం , క్రైస్తవులు 3.6 శాతం,ఇతరులు(జైనులు) 1.4శాతం ఉన్నారు.శిక్కులుఅధికంగా నివసించే ప్రాంతంగా గురునానక్ నగర్ ఏర్పడింది. వాణిజ్య కేంద్రం కావడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గా ఉంది.అటోనగర్ లో మోటారు వాహనాల విడిభాగాలు,భవన నిర్మాణ సామాగ్రి,దుస్తుల తయారీ జరుగుతోంది.తెలుగు చిత్రనిర్మాణం మద్రాసు, హైదరాబాద్ లలో జరిగినా సినిమా పంపిణి వ్యవస్థ విజయవాడలోనే నెలకొంది. ముద్రణా రంగం అది నుంచి విజయవాడ కేంద్రంగా ఉంది.లక్షలపుస్తకాల ముద్రణ జరిగింది,ఇప్పటికీ జరుగుతున్నది.రాష్ట్రంలోజరిగే ముద్రణలో 90 శాతం ఇక్కడే జరుగుతున్నది.ప్రధాన పత్రికల కార్యాలయాలు,ముద్రణ కేంద్రాలు బెజవాడ లోనే ఉన్నాయి.పురాతనమైన రామ్మోహన గ్రంథాలయం,హనుమంతరావు గ్రంథాలయాలకు ఈ వాడ ప్రసిద్ధి.వెలిదండ్లహనుమంతరావు ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని లాఠీ దెబ్బలకు జైల్లో మరణించారు.ఆయన గుర్తుగా 1934లో ఈ గ్రంథాలయం ప్రారంభించారు.విక్టోరియామ్యూజియంలో పురాతనమైన శిల్పాలు భద్రపరిచారు.బౌద్ధులు,జైనులు,శైవులకు ప్రాచీన కాలం నుంచి బెజవాడ ఆలవాలం.అందుకు సాక్ష్యాలుగా గుహాలయాలు మిగిలాయి.ప్రసార కేంద్రాలుగా ఆకాశవాణి, దూరదర్శన్ లు ఉన్నాయి.నగరంలో 1921లో మారుతీ సినిమా హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది.దుర్గకళామందిరం(1923),రామాటాకీసు(1929) ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతానికే చెందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ,సావిత్రి సినీ రంగ దిగ్గజాలు.16,65 జాతీయ రహదారులు నగరంతో అనుసంధానమై ఉన్నాయి.ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.పాయకాపురం నుంచి రామవరప్పాడు వరకూ రింగ్ రోడ్డు పూర్తిచేయాల్సిఉంది.నగరానికి మెట్రో రైలు కూడా ఇటీవలే మంజూరు అయింది. నగరంలో ప్రధానంగా బందరు,ఏలూరు రహదారులు ఉన్నాయి.బీసెంట్ రోడ్డు నగరం ప్రధానవ్యాపార కూడలి.వన్ టౌన్ సామరంగ్ చౌక్ పరిసరాలు హోల్ సేల్ పచారీ సరుకులు మార్కెట్. విజయవాడ కు 19 కి.మీ దూరంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది.భారత దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడినుంచి విమాన సౌకర్యం ఉంది.విద్యలకు కూడా విజయవాడ నెలవు.50 ఏళ్ల క్రితం లయోలా,స్టెల్లా,కేబీఎన్,ఎస్ఆర్ ఆర్ కళాశాలలు ప్రధాన విద్యా కేంద్రాలుగా విలసిల్లేవి. ఎన్టీఆర్ ఆరోగ్యవైద్య విశ్వవిద్యాలయం(దేశంలో మొదటి ఆరోగ్యవైద్య వర్సిటీ) విజయవాడ లో నెలకొంది.ప్రభుత్వ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. 1940లనుంచి విజయవాడ కమ్యూనిస్టుల కోటగా ఉంది.కార్పొరేషన్ మొదటిమేయర్ పదవి కమ్యూనిస్టులకే దక్కింది.గన్నవరంలో ఐటీ పార్క్ , ఎస్ఈజడ్ ఏర్పాటు కానుంది.మరో ఐటీ పార్క్ మంగళగిరిలో ఏర్పాటు కానుంది.నగరంలో నాలుగు సీవేజ్ (మురికినీటి శుద్ధి) ప్లాంట్లు ఉన్నాయి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ విజయవాడ వాసి.ప్రముఖ శిల్పి కృష్ణారావు (ఉండవల్లి అనంతస్వామి విగ్రహం సరి చేసినవాడు), స్థానికులే.మల్లయోధులు మహమ్మద్ గాలీబ్,సయ్యద్ అప్పలస్వామి ఇక్కడి వారే.జైనమతాచార్యుడు కాళీ భద్రాచార్యుడు,శైవమతాచార్యులు శ్రీపతి పండితారాధ్యులు విజయవాడ వారే.రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు,మరుపిళ్లచిట్టి,కాట్రగడ్డ మధుసూదనరావు,గులాం మొహిద్దీన్, బాలసుబ్రహ్మణ్యం గుప్తా ,రాంపిళ్ల నరసాయమ్మ ప్రముఖులు. ప్రముఖ నాస్తిక కేంద్రం స్థాపకుడు గోపరాజు రామచంద్రరావు(గోరా) ఇక్కడి వారే.డా.సమరం,లవణం,సమరం ఆయన కుమారులే.7 కి.మీ మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మించి బైపాస్ కు అనుసంధానం చేయనున్నారు.నగరం 61.88 కి.మీ మేర విస్తరించి ఉంది.రెండవ అతి పెద్ద నగరం.జన సాంద్రత కి.మీ 16.939 మందిగా ఉంది.సాంస్కృతిక కార్యక్రమాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం, సిద్ధార్ధ అకాడమి కేంద్రంగా జరుగుతున్నాయి.అతి పెద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి జిల్లా, రాష్ట్ర, అంతరాష్ట్ర బస్సులు తిరుగుతాయి.నగరంలో 400 వరకూ సిటీ బస్సులు తిరుగుతాయి.రాష్ట్రలారీరవాణా అసోసియేషన్ కు విజయవాడ ప్రధాన కేంద్రం.

చారిత్రిక నేపధ్యం

3 నుంచి 7 లో శతాబ్దం వరకూ పాలించిన విష్ణుకుండినులకు బెజవాడ రాజధానిగా విలసిల్లింది. రాజు మాధవవర్మ కుమారుడు రథ చక్రం క్రింద బీద బాలుడ్ని చంపడంతో రాజు తన కుమారుడినీ అలాగే చంపాలని అజ్జాపించాడు.మల్లేశ్వరాలయంలోని విష్ణువర్ధనుడి శాసనం,మరో కాల్యమబోయ శాసనం,విజయనగరం జమిందారులచరిత్ర,చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి. అక్కన్న,మాదన్న గుహలు,మొగల్రా జపురం గుహలు మూడు, నాలుగు శతాబ్దాలకు చెందినవి.ఒకప్పుడు ఇవి బౌద్ధరామాలని తరువాత శైవులు స్వాధీనంలోకి వెళ్లాయని చారిత్రికుల అభిప్రాయం. వీటిని విజయవాడను పాలించిన శాలంకాయనులు,పల్లవులు నిర్మించారని మరో కధనం.8వశతాబ్దంలో చైనా యాత్రికుడు హు ఆన్ చ్వాంగ్ విజయవాడను సందర్శించాడని,ఆయన ఈ ప్రాంతం తెనకచక (ధాన్యకటకం)రాజ్యంలో భాగంగా పేర్కొన్నారు.సీతానగరం,ఉండవల్లి కొండలగుహల్లోబౌద్ధభిక్షవులు దీపాలు వెలిగించే వారిని,కాంతిలో బెజవాడ వెలిగిపోతున్నదని రాసాడు.ఇక్కడ ఔషధ కొండ ఉండేదని,ఈపర్వత సానువుల్లో సంచరించేసాధువులకు బంగారం తయారు చేసే హేమ విద్య తెలుసని రాసాడు. కృష్ణా నది లోకానికి ఉపకారం చేసే అనేక ఔషధల్ని,బీజాల్ని ప్రవాహంతో ఈ ప్రాంతంలో పడేయడం తో దీనికి బీజపురిగా పేరు ఉంది.ఆ బీజాలు మొలకెత్తి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాయంటారు.శాతవాహనుల కాలం నుంచి విజయవాడ పేరు శాసనాలలో కనిపిస్తుంది.
8-10 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాళుక్యుల పై రాష్ట్రకూటులు పలుమార్లు దండయాత్రలు చేసేవారు.ఈయుద్ధాల్లో నగరం పలుమార్లు చేతులు మారింది. యుద్ధమల్లుడు రాష్ట్ర కూటులతో సంధి చేసుకుని మళ్లీ విజయవాడను సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత చోళులకు,చాళుక్యులకు 70సంవత్సరాలపాటు సాగినయుద్ధంలో ఇక్కడ శాంతిభద్రతలు కరువైనాయి.సా.శ 999లో రాజరాజ చోళుడు చాళిక్యులపై విజయంతో విజయవాడను స్వాధీనం చేసుకున్నాడు.దాంతో వేంగి చాళిక్యులు తమ రాజధాని బెజవాడ నుంచి రాజమహేంద్రవరానికి మార్చారు.
11-18 శతాబ్దాల నుంచి రాజధాని కాకపోవడంతో రాజకీయ ప్రాధాన్యత కోల్పోయింది.వాణిజ్య కేంద్రంగా మారింది.11 వశతాబ్దినాటి 47శాసనాలు ఈ ప్రాంతంలో లభించాయి.ఇతర తవ్వకాల వల్ల వేయ్యేళ్ల క్రితంఇక్కడ మహానగరం ఉండేదని చరిత్ర కారులుచెబుతున్నారు.కృష్ణానదిలోఓడిసా, మధ్యప్రదేశ్,కర్ణాటకకు జలమార్గం ఉండేది.దక్షిణాపద భూమార్గాలకు కూడలిగా ఉండేది.కాకతీయులు,రెడ్డిరాజులు,గజపతులు విజయవాడను వ్యాపార కేంద్రంగానే అభివృద్ధి చేసారు.15వశతాబ్దిలో పూసపాటి రాజులు పాలించారు.గజపతులపై యుద్ధానికి వెళుతూ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ విడిది చేసాడు. సమీపంలోని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ను సందర్శించారు.స్వామి ఆదేశంతోనే ఆయన ఆముక్తమాల్యద కావ్యరచనకు పూనుకున్నారని అవతారికలో రాసాడు.16వశతాబ్ది తరువాత అటు రాజకీయ,వాణిజ్య ప్రాముఖ్యత ను కోల్పోయి చిన్న ప్రాంతానికి పరిమితం అయింది.ఈస్టిండియా కంపెనీ కాలంలో1832లోతీవ్రకరువు సంభవించింది.అప్పుడు ఆర్ధర్ కాటన్ కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసి సేద్యానికి ఉపయోగించాలని నివేదిక ఇచ్చాడు.ఈప్రాంతం పరిశీలించి విజయవాడ ఆనకట్టకు అనువైనదని ఎంపిక చేసాడు.19వదశకంలో ఆనకట్ట నిర్మాణం తో మళ్లీ బెజవాడకు ప్రాముఖ్యత పెరిగింది.1888లో మున్సిపాలిటీ,1981లో కార్పోరేషన్ అయింది.1940 వరకూ వన్ టౌన్ ప్రాంతం అడవి,కొండలుగా ఉండేది.1947తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంతో అక్కడి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.49 నాటికి అకస్మాత్తుగా జనసాంద్రత వన్ టౌన్ లో పెరిగింది.1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతో రాజధానిగా విజయవాడను చేయాలని ప్రతిపాదన ఒక్క ఓటుతో వీగి కర్నూలు అయింది.తెలంగాణ విలీనం తో 1956 లో హైదరాబాద్ రాజధాని అయింది.మొదటి నుంచి ఓడరేవు గా మచిలీపట్నానికి ఉన్న ప్రాముఖ్యత బెజవాడకు రాలేదు.తెలంగాణ విభజనతో విజయవాడ,గుంటూరు మధ్య ప్రాంతం అమరావతి గా రాజధాని అయింది.కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు రాజధానిగా విజయవాడ మారింది.పర్యాటక ప్రదేశాలలో కనకదుర్గ గుడి
గాంధీ కొండ,ఉండవల్లి,మొగల్ రాజగోపురం గుహలు,హజ్రత్ బాల్ మసీదు,గుణదల మేరీ మాత కొండ, బట్టర్ ఫ్లై పార్క్, ప్రకాశం బ్యారేజి,భవానీ ద్వీపం,కొండపల్లి ఖిల్లా తదితరాలు ఉన్నాయి.ఏదిఏమైనా విజయవాడ నగరానికి చారిత్రిక,రాజకీయ, సాంస్కృతిక నేపధ్యం ఉంది.నవ్వ ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధాని అయినా ముఖద్వారం విజయవాడ కావడం దానికున్న ప్రాశస్త్యం మారదు.

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్..

0

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్.

చేగుంట,నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం బోనాల,అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించి తగు సూచనలు చేసిన చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,మిల్లు కు వచ్చిన లారీలను తొందరగా కాలిచేసి పంపాలని హమాలీలను పెంచాలని సూచించారు.తహసీల్దార్ వెంట ఆర్ఐ జయభారత్ రెడ్డి,సర్వేయర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

0

మెదక్, నవంబర్, 11, మెదక్ టుడే న్యూస్:

•జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

జిల్లా పోలీస్ అధికారి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యల భాగంగా బీడీ టీమ్‌ మరియు డాగ్ స్క్వాడ్‌ సిబ్బంది సంయుక్తంగా న్యూ బస్ స్టాప్‌, ఓల్డ్ బస్ స్టాప్‌, రైల్వే స్టేషన్‌ మరియు చర్చి ప్రాంతాలలో చెకింగ్‌ నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లగేజీలు మరియు వస్తువులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను నిరోధించడం ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.అదే విధంగా, గత ఐదు రోజులుగా గుల్షన్ క్లబ్ దగ్గర రోడ్డు పక్కన ఒక వాహనం ఆగి ఉండగా, అది ఉపయోగించకుండా ఉండడం వల్ల అనుమానాస్పదంగా కనిపించిందని ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో, మెదక్ టౌన్ సీఐ శ్రీ మహేష్ గారు వెంటనే స్పందించి బీడీ టీమ్‌ను ఘటన స్థలానికి తీసుకొని వచ్చారు.బీడీ టీం సిబ్బంది ఆ వాహనాన్ని అన్ని కోణాల్లో తనిఖీ చేసిన అనంతరం ఆ వాహనంలో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని నిర్దారించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల భద్రత పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యం అని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌ లేదా డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్, ఆర్‌ఎస్ఐ సుభాష్, బీడీ టీమ్‌ నర్సింలు, డాగ్ స్క్వాడ్‌ శ్రావణి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..

0

ఢిల్లీ,(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషను నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదునపు కలెక్టర్..

0

మెదక్ నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.

కొనుగోలు లో ఆలస్యం ఉండద్దు.

•70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.

•అదనపు కలెక్టర్ నగేష్.

మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికం గా సందర్శించారు.ఈ సందర్బంగా కలెక్టర్ కేంద్రం లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను పరిశీలించి ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి… ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారు.సరిపడా టార్ఫాలిన్ లను అందుబాటులో పెట్టుకోవాలని.. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన .వర్షం వచ్చే సూచనలు తెలిసినప్పుడు కేంద్రం లో ఉన్న ధాన్యం తడవకుండా వెంటనే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఇప్పటివరకు 70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు.ఈ పరిశీలన లో అదనపు కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

0

(స్టేట్ బ్యూరో)నగర కర్నూల్ జిల్లా, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

•నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

•పుస్తకాలు తరలించే ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులు

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్య పుస్తకాలను తరించిన జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది,పుస్తకాలను తరలించే క్రమంలో ఆటో బోల్తాపడడంతో, తీవ్రంగా గాయపడిన అశోక్, కార్తీక్, నాని, శివ అనే నలుగురు విద్యార్థులు,గాయాలపాలైన విద్యార్థులలో శివ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు,ఈ ఘటనపై వివరణ అడగగా తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో, డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..

హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్.. సామూహిక విష ప్రయోగ కుట్ర గుట్టురట్టు..

0

హైదరాబాద్, నవంబర్,11 మెదక్ టుడే న్యూస్:

హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్.. సామూహిక విష ప్రయోగ కుట్ర గుట్టురట్టు.హైదరాబాద్ లో గుజరాత్ ఏటీఎస్ ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. డాక్టర్ మొయినుద్దీన్ అనే ఈ వ్యక్తి, రాజేంద్రనగర్లో పట్టుబడ్డాడు. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి సామూహికంగా ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు సమాచారం. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో రెసిన్ అనే విషాన్ని కలిపి ఈ దుశ్చర్యకు పాల్పడాలని యోచించినట్లు తెలిసింది. ఇప్పటికే సయ్యద్ మొయినుద్దీన్తో పాటు మరో నలుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం, భూటాన్ నుంచి మోదీ హెచ్చరిక..

0

ఢిల్లీ, (స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: భూటాన్ నుంచి మోదీ హెచ్చరిక

•ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు

•భూటాన్ పర్యటన నుంచే తీవ్రంగా స్పందించిన ప్రధాని

•బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా

ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 12 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ… థింపూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని మోదీ స్పష్టం చేశారు.ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. “నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.

కొడుకును కాపాడేందుకు వెళ్లిన తల్లిపై కత్తితో దాడి..

0

(స్టేట్ బ్యూరో)మహబూబా బాద్, జిల్లా నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్

కొడుకును కాపాడేందుకు వెళ్లిన తల్లిపై కత్తితో దాడి.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో కొడుకును కత్తితో పొడుస్తున్నాడని అడ్డుకోబోయిన తల్లిని కూడా కత్తితో పొడిచిన ఘటన కలకలం రేపింది. బూరుగండ్ల రవి, పారునంది అర్జున్ ల మధ్య జరిగిన ఘర్షణలో రవి, అర్జున్ ను పొడుస్తుండగా, అడ్డుకోబోయిన అర్జున్ తల్లి సునీతను కూడా రవి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన తల్లి, కొడుకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత పాతకక్షలే ఈ ఘర్షణకు కారణమని గ్రామస్తులు తెలిపారు.