📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 80

ఆర్మీ ,సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దాంజిల్లా అదనపు కలెక్టర్ నగేష్..

0

ఆర్మీ ,సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దాం
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.

ఆర్మీ , సహాయ సహకారాలు ఆర్ధికంగా సహకరిద్దామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారి వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరించిన స్టిక్కర్స్ ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు .భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ లో శికష్ణ పొందిన వారు పాఠశాల,,ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలో విక్రఇస్తారన్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాధకిషన్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్,నాగరాజు,జ్యోష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీమెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధంమెదక్ లో ఘన నివాళి..

0

తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీ
మెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధం
మెదక్ లో ఘన నివాళి*

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

మెదక్: తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి అందేశ్రీ అని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.కొండల్ రెడ్డి, తెలంగాణ ఎన్ జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రావు కొనియాడారు. సోమవారం మెదక్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద అందేశ్రీ చిత్రపటానికి పూల మాల వేసి ప్రజా సంఘాలు నివాళులర్పించాయి. ఈ సందర్భంగా సాహితీ రంగంతోపాటు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని బిగిసిన పిడికిలిలా మార్చిన ఘనత అందేశ్రీకి దక్కుతుందని వక్తలు కీర్తించారు. అందేశ్రీకి మెతుకు సీమతో విడదీయరాని అనుబంధం ఉందని వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగరాజు, శంకర్, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్, డీబీఎఫ్ నేతలు రామస్వామి, దయాసాగర్, నాయకులు మనోహర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా..

0

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా

•నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన అమిత్ షా

•ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి

•ఇప్పుడేం చెప్పినా తొందరపాటు అవుతుందన్న సీఆర్పీఎఫ్ డీఐజీ

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెల్లడించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి పేలుడు ఘటనపై ఆరా తీశారు.ఇదిలా ఉండగా, పేలుడు సంభవించిన చోటుకు ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్, డీఐజీ సీఆర్పీఎఫ్ కూడా సంఘటన స్థలానికి వచ్చాయి. ఈ ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఏం చెప్పినా తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ అన్నారు.పేలుడు తర్వాత, రోడ్డుపై శరీర భాగాలు కనిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు షాక్ అయ్యారని అన్నాడు. “రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించడం చూసి మేం షాకయ్యాం. మాటల్లో వివరించలేని విధంగా ఉంది” అని అతను తెలిపాడు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్..

0

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం…వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్. ప్రముఖ కవి‘జయ జయ హే తెలంగాణ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది: సీఎం రేవంత్ రెడ్డి..

0

హైదరాబాద్: అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు.

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది, మెదక్ ఎమ్మెల్యే రోహిత్..

0

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

కొంటూరు చెరువును సుందరికరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మత్స్యకారులకు ఉపాధి కోసం చేప పిల్లల పంపిణీ

ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు

పేదలకు సన్న బియ్యంతో కడుపు నింపుతున్నాం
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ మెదక్ మండలం నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి (యాదగిరి)

రాజ్ పల్లి,మల్కాపూర్ తండా,కోమ్ టూర్ లలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుఈ సందర్భంగా కోoటూర్ ఏర్పాటు చేసిన సమావేశములో మాట్లాడుతూ ..రూ 35వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళు, గృహ లక్ష్మి,మహాలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీ తో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెదక్ మండలం ‌కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
సంబంధిత మత్స్య శాఖ అధికారులు
మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి విడుదల చెయ్యడం జరిగింది . అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.మెదక్ శాసన సభ నియోజకవర్గ పరిదిలోని (546) చెరువు లు కుంటలలో (రూ.200.88) విలువ గల (211.39) లక్షల చేప పిల్లలు సరఫరా చేయబడునని తెలిపారు. ఇందులో భాగంగా (39) పెరినియల్ చెరువులలో (63.28) లక్షల 80-100ఎం ఎం సైజు గల చేపపిల్లలు మరియు (507) సిసనల్ చెరువులలో (148.10) లక్షల 35-40mm సైజు గల చేపపిల్లలు విడుదల చేయబడునన్నారు. అదేవిదముగా జిల్లాలోని (1728) చెరువు లు కుంటలు మరియు పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులలో రూ.(488.75) లక్షల విలువగల (550.88) లక్షల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. (82) పెరినియల్ చెరువులలో (132.43) లక్షల 80-100mm సైజు గల చేపపిల్లలు మరియు (1646) సిసనల్ చెరువులలో (418.45) లక్షల 35-40ఎం ఎం సైజు గల చేపపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని (309) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (16,820) సభ్యులకు జీవనోపాది కలుగుట వలన వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
మెదక్ శాసన సభ నియోజకవర్గ పరిధిలోని (98) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (6762) సభ్యులకు జీవనోపాధి కలుగుట వలన ఎంతో సంతోషిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు తాజా చేపల మాంసము పుష్కలముగా లభిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో వినియోగంతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని, ప్రణాళిక ప్రకారం సకాలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం,జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, అధ్యక్షులు ఎల్ల బోయిన ప్రశాంత్, డైరెక్టర్ జి దేవేందర్, జి అంజయ్య, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి శ్రీనివాస్ చౌదరి రమేష్ మార్గం నాగరాజు ఆకుల మహేష్ సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

0

  • భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ, నవంబర్ 10 :
బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి దశలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా, మిగిలిన 122 స్థానాలకు మంగళవారం రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు ప్రజాభిప్రాయ పరీక్షకు హాజరవుతున్న దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రెండో దశలో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి, మధుబని, సుపౌల్, అరేరియా, కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో ఓటింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు లక్షల మంది పోలీసు సిబ్బంది, కేంద్ర భద్రతాబలగాలను నియమించారు. అవసరమైన సామగ్రితో ఎన్నికల సిబ్బంది ఇప్పటికే సంబంధిత బూత్‌లకు చేరుకున్నారు. ఈ దశలోనూ నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ మహాగఠ్‌బంధన్, ఎన్డీయే కూటముల మధ్యనే నెలకొంది. దీనితో పాటు కొత్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నాయకత్వంలోని జనశక్తి జనతాదళ్ పార్టీలు కూడా బరిలో నిలిచాయి. రెండో దశ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ణయించే అవకాశముండటంతో అన్ని పార్టీల దృష్టి ఈ దశ పోలింగ్‌పై కేంద్రీకృతమైంది.