మెదక్ జిల్లా 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్
మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో వివిధ గ్రూపులలో ఖాళీలను భర్తీ చేయుట కొరకు 06-07-2026 సోమవారం రోజున స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది కావున జిల్లాలోని వివిధ వర్గాల విద్యార్థులు తమ తమ వోరిజినల్ సర్టిఫికెట్స్ & జిరాక్స్ తీసుకొని 9:00 వరకు మెదక్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (గర్ల్స్)కు రావాలని వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా సమన్వయకర్త అయిన శ్రీమతి అనురాధ మేడం గారు తెలపడం జరిగింది
మెదక్ జులై 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి. దుర్గేష్ గౌడ్
మెదక్ జిల్లా లో సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఎన్యుమరేషన్ పత్రాలను బిఎల్వోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరగాలని, ప్రజలందరినీ భాగస్వాములు చేసి, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ గా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ తహసిల్దార్ సింధు రేణుక,తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట,జులై,3,(మెదక్ టుడే న్యూస్)పాపన్నపేట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం పర్యవేక్షణలో జరిగిన ఈకార్యక్రమంలో దేవాదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్స్ పెక్టర్ రంగారావు,మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది,కరీంనగర్ శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 77 రోజులకు గాను హుండీల ద్వారా రూ.65,89,200 నగదు ఆదాయం సమకూరింది. అలాగే 38 గ్రాముల మిశ్రమ బంగారం మరియు (1,230 కిలోల) మిశ్రమ వెండి వెండి కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది,పాపన్నపేట పోలీస్ సిబ్బంది,శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్,జూలై,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి పేట, ఇక్రిశాట్ కాలనీ ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జెన్-జెడ్ బ్యాటరీ స్కూటీ’ షోరూం మరియు ‘పులావ్ హట్’ హోటళ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కలిసి ప్రారంభించారు.
పర్యావరణ హిత వాహనాలపై అవగాహన:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ కోసం బ్యాటరీ వాహనాలను వాడటం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ వాహనాలపై అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా ప్రారంభమైన ఈ బ్యాటరీ షోరూం అమీన్‌పూర్‌లో మంచి ఆదరణ పొందాలని, అలాగే పులావ్ హట్ హోటల్ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
వ్యాపార అభివృద్ధికి సహకారం:
అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మరియు మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్‌పూర్ ప్రాంతంలో ఇటువంటి ఆధునిక వ్యాపార సంస్థలు రావడం సంతోషకరమని, కొత్త సంస్థల పురోభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు నందారం రమేష్ గౌడ్, కొల్లూరు గోపాల్, ఐలాపుర్ నరసింగరావు, మల్లేష్, యాజమాన్యం రమ్యరాజు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(స్పెషల్ కరస్పాండెంట్) షాద్‌నగర్,జులై ,1,మెదక్ టుడే న్యూస్:క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ డైలీకి రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గండిపేట మండల రిపోర్టర్‌గా నియమితులైన దాసరి రవికుమార్ బుధవారం షాద్‌నగర్‌లోని రీజినల్ కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా స్టేట్ స్పెషల్ కరస్పాండెంట్ అండ్ స్టేట్ బ్యూరో చీఫ్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు చేతుల మీదుగా రవికుమార్‌కు అక్రిడిటేషన్ కార్డును అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, విలేకరి సమాజానికి వారధిగా, ప్రజల సమస్యలకు గొంతుకగా, నిజాయితీతో కూడిన వార్తా రచనకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.అక్రిడిటేషన్ కార్డు అందుకున్న దాసరి రవికుమార్ సంస్థ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిష్పక్షపాత వార్తలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మంగళవారం శివంపేట్ మండలం లోని బీక్యాతాండ లో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రిసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ,ఆర్డీవో ఎడి సర్వే ఎంపీడీవో గ్రామ సర్పంచ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.శివంపేట మండలం 1946 సంవత్సరంలో రిసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయవిక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలన్నారు.గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ… శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఎ . కిషన్,, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చేగుంట,జూన్,29,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ధ్వజసంభ ప్రతిష్ట అమ్మవారి కళ్యాణం అనంతరం సాయంత్రం బోనాలు తీయడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ఇంత ఘనంగా బోనాలు తీయడం ఎంతో సంతోషకరంగా ఉంది గ్రామ ఆడపడుచులు బంధువులు మిత్రులు అందరి సహకారంతో అమ్మవారికి బోనాలు తీయడం ఎంతో సాధన సంతోషకరంగా ఉంది ఈ గుడి కట్టడానికి సహకరించిన గ్రామ ప్రజలకు బంధుమిత్రులకు అధికారులకు మాన గ్రామ పాలకవర్గ సభ్యులకు దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.ఆలయం అభివృద్ధి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పశువు అన్ని గ్రామం కూడా అభివృద్ధి పథంలో ముందుండాలి దానికి మన పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు,ముదిరాజ్ సంఘం సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ఆడపడుచులు బంధుమిత్రులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
హైదరాబాద్,జూన్,28, మెదక్ టుడే న్యూస్(స్టేట్ బ్యూరో)ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పి.వి. ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ స్మారక కార్యక్రమంలో పి.వి. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి పి.వి. గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టి వై జె ఎఫ్) చాంబర్స్ కమిటీ చైర్మన్, పి.వి. నరసింహారావు కుమారుడు శ్రీ పి.వి. ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం డా. జితేందర్ రావు తనుగుల (తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు), ఎం. హరి బాబు తదితరులతో కలిసి మహానేతకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వి. ప్రభాకర్ రావు మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ, గౌరవం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన మహానేతగా పి.వి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. నిజాయితీ, నిస్వార్థ ప్రజాసేవ, దూరదృష్టి, సమర్థ నాయకత్వం వంటి ఆయన విలువలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, యువత వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పలువురు వక్తలు పి.వి. నరసింహారావు దేశ ఆర్థిక, విద్యా, విదేశాంగ, పరిపాలనా రంగాల్లో చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, దేశాభివృద్ధి పథంలో ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో పి.వి. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు మహానేతకు మరోసారి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంకల్పించారు.
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అమీన్‌పూర్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యుల.
అమీన్‌పూర్, జూన్ 27:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ డివిజన్ పరిధిలోని మారుతి నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నందారం నరసింహ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,300 నుంచి 1,500 మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ, కాలనీల అభివృద్ధికి నా వంతు కృషి:
ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ, “మారుతి నగర్‌లో కొలువుదీరిన లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది” అని పేర్కొన్నారు. అలాగే, బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని, స్థానిక సమస్యల పరిష్కారానికి, కాలనీల మౌలిక వసతుల కల్పనకు మన స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం కూడా మెండుగా ఉందని, వారి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన హామీ ఇచ్చారు.
అభినందించిన ఆలయ కమిటీ:
అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. “నరసింహ గౌడ్ గారి కుటుంబం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయం. వారి కుటుంబంపై ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, మారుతి నగర్ కాలనీ వాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(స్పెషల్ కరస్పాండెంట్) షాద్‌నగర్,జూన్,26,మెదక్ టుడే న్యూస్: మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్‌నగర్ పట్టణం ముదిరాజ్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన పీర్ల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ పాల్గొని పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ, మొహర్రం పండుగ మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పీర్ల వేడుకల్లో పాల్గొనడం రాష్ట్ర సంస్కృతిలోని విశిష్టతను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు సమాజంలో ఐక్యతను, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళీమోహన్ (అప్పి), ముబారక్ అలీ ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం, మహమూద్, అశోక్, బీరప్ప, సాయి కుమార్‌తో పాటు స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.