📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 13

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధుల బృందం మరింత బలోపేతం,ఆమనగల్‌కు రాఘవేందర్, తలకొండపల్లికి విజయ్‌కు అక్రిడిటేషన్ కార్డుల అందజేతడాక్టర్ కొమ్ము వెంకన్న బాబు చేతుల మీదుగా బాధ్యతల స్వీకరణ.

0
Oplus_16908288

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,జూన్,25,మెదక్ టుడే న్యూస్:
క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ డైలీ రాష్ట్రవ్యాప్తంగా తన వార్తా విస్తరణను మరింత పటిష్ఠం చేస్తూ మండల స్థాయిలో ప్రతినిధుల నియామక ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆమనగల్ మండల రిపోర్టర్‌గా రాఘవేందర్, తలకొండపల్లి మండల రిపోర్టర్‌గా విజయ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా షాద్‌నగర్‌లోని క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో రాష్ట్ర బ్యూరో చీఫ్, స్పెషల్ కరస్పాండెంట్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు వారి చేతుల మీదుగా అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి వార్తలో వాస్తవాలకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల సమస్యలను నిష్పాక్షికంగా ప్రతిబింబించాలని సూచించారు. సంస్థ విశ్వసనీయతను మరింత పెంపొందించేలా ప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అక్రిడిటేషన్ కార్డులు అందుకున్న రాఘవేందర్, విజయ్‌లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందించేందుకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయ సిబ్బంది, పాత్రికేయులు, ఆహ్వానితులు పాల్గొని నూతన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజారోగ్యానికి పార్కులు చిరునామా,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

అమీన్‌పూర్,జూన్,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్ప లేఔట్ కాలనీ మరియు పీఎన్ఆర్ కాలనీల్లో సుమారు రూ. 1.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో ఉన్న ప్రతి పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పార్కుల అభివృద్ధి వల్ల స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడమే కాకుండా, కాలనీల్లో పచ్చదనం పెరిగి స్వచ్ఛమైన గాలి అందుతుందని తెలిపారు. ప్రతి పార్కులోనూ పిల్లల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు, వాకింగ్ ట్రాక్ పనులను కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ అధికారి సురేష్, డీఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్ మరియు మాజీ కౌన్సిలర్లు కృష్ణ, బిజిలి రాజు, మహదేవ రెడ్డి, మాజీ కోఆప్షన్ నెంబర్ రాములు, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, కాట సునీత, జగదీష్,కొల్లూరు యాదగిరి, మహిపాల్ రెడ్డి, పిఎన్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ గిరీష్, సెక్రటరీ హరీష్, జాయింట్ సెక్రెటరీ, సంతోష్, ట్రెజరర్, అశోక్ మెంబర్స్ వెంకట్, సాంబశివరావు, ఆనంద్, కాలనీ వాసులు పెద్ద పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి ఎస్సైజి. చైతన్య కుమార్ రెడ్డి.

0

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో పోలీసులు,పి విష్ణు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుండి మక్కరాజుపేట రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేగుంట ఎస్సై జి. చైతన్యకుమార్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి “డ్రగ్స్‌కు నో చెబుదాం జీవితాన్ని కాపాడుకుందాం” అంటూ మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపన కోసం చేతులు చాచి ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి మాట్లాడుతూ 1989 నుండి ఆంటీ డ్రగ్స్ డే నిర్వహిస్తున్నారు డ్రగ్స్ రహిత సమాజం నిర్మూలించుటకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి గంజాయి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల వంటి మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ రవాణా, విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ఎర్ర యాదగిరి, స్థానిక యువకులు బాలేష్, అక్బర్, నరేష్, ఎల్లేష్, జీవన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

విద్యుత్ ఘాతంతో పాడిగేదె మృతి,ఆదుకోవాలని పేద రైతు ఆవేదన.

0

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, వడియారం గ్రామ పరిధిలో కరెంట్ షాక్ తగిలి ఒక పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందినది.గ్రామానికి చెందిన పేద రైతు వెల్దుర్తి ఎల్లంకి చెందిన గేదె పొలం వద్ద మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైంది.కుటుంబానికి జీవనాధారమైన గేదె కళ్లముందే ప్రాణాలు విడవడంతో యజమాని ఎల్లం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ప్రమాదం వల్ల ఆ పేద రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం నుండి పూర్తి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మీద దుష్ ప్రచారాలు (వదంతులు) నమ్మవద్దుఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్.

0

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని ఇబ్రహీంపూర్ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ మాట్లాడారు కావున గత సంవత్సరంలో ఇబ్రహీంపూర్ కు ఇందిరమ్మ ఇల్లు 20 రావడం జరిగింది అందులో భాగంగా 04 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అవ్వగా 06 ఇందిరమ్మ ఇండ్లు వివిధ నిర్మాణ దశలో 01 ఇందిరమ్మ ఇల్లు పెండింగ్లో ఉండగా 09 ఇందిరమ్మ ఇల్లు షేర్ వాల్ కాంట్రాక్ట్ కు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ లబ్ధిదారులు మా వద్ద డబ్బులు లేకపోవడం వల్లనే కాంట్రాక్టుకు ఇవ్వడం జరిగిందని లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది.ఇందులో ఎవరి బలవంతం లేదు మా ఇష్టపూర్వకంగానే కాంట్రాక్టు బేస్ కు అప్పగించామని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది. కాంట్రాక్టు వారు బిల్లులు తీసుకొని పరారు అయినరు అని చెప్పడం ఆ వాస్తవం తప్పుడు ప్రచారాలు చేయవద్దని డి ఈ ,ఏఈ వీరికి ఎలాంటి సంబంధం లేదు అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన అటువంటి వారి మీద ఇకమీదట కఠిన చర్యలు తీసుకోబడుతాయి. ఇబ్రహీంపూర్ ఇందిరమ్మ లబ్ధిదారులు వివరించడం జరిగింది.

దళిత జర్నలిస్ట్‌పై ,మట్టి మాఫియా దారులు దాడి-నిందితులను అరెస్ట్ చేయాలని డిజిటల్ మీడియా అసోసియేషన్,తాసిల్దార్ కు వినతి పత్రం.

0

మసాయిపేట,చేగుంట,జూన్,24,మెదక్ టుడే న్యూస్:దళిత జర్నలిస్ట్‌పై దాడి ఘటనను నిరసిస్తూ,నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మసాయిపేట మండల డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు  బుధవారం స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,చుంచు మహేందర్ మసాయిపేట మండలం లో డిజిటల్ మీడియా , జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల జూన్ 15న ఆయన స్థానిక ‘ అక్రమ మట్టి మాఫియా’దందాపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించారు.ఈ కథనంతో మా పైనే వార్త రాస్తావా అంటూ. తీవ్ర ఆగ్రహంతో నిందితుడు పాపన్న వేణుగోపాల్,జర్నలిస్ట్ మహేందర్‌పై కక్ష పెంచుకున్నాడు.21న చొరవాణి ద్వారా అసభ్య పదజాలంతో తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. రాత్రి 8:50 గంటల సమయంలో, మసాయిపేట ‘షేరి పంజాబీ డాబా’ వద్ద జర్నలిస్ట్ మహేందర్ ఉండగా, నిందితుడు వేణుగోపాల్ తనతో పాటు సుమారు 15 మంది అనుచరుల తో కలిసి,దాడి చేశారు. బాధితుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని తెలిసి,కులం పేరుతో దూషిస్తూ, శారీరకంగా తీవ్రంగా గాయపరిచారు.నిన్ను వాహనం టైరు కింద పడేసి చంపేస్తా అంటూ బెదిరించినట్లు బాధితుడు వినతిపత్రంలో పేర్కొన్నాడు.

అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో వర్షపు నీటితో అల్లాడుతున్న ప్రజలు

0

అమీన్‌పూర్, జూన్ 23:మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి 

అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ వాసులకు వర్షం ఒక శాపంగా మారింది. నిన్న రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే కాలనీ అస్తవ్యస్తమైంది. డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా ఉండటంతో, వర్షపు నీరు రోడ్ల మీద పారడమే కాకుండా, నేరుగా ఇళ్లల్లోకి చేరుతోంది. దీంతో కాలనీవాసులు నరకప్రాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.”

ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. చిన్నపాటి వర్షం కురిసినా చాలు, కాలనీలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వసతి లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఇళ్లలోకి వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లోని సామగ్రి పాడైపోవడంతో పాటు, బయటకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.”

*(ప్రభుత్వంపై విమర్శలు/డిమాండ్)*

“స్థానిక కాలనీవాసులు మాట్లాడుతూ.. ‘మేము ఎన్నిసార్లు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం హామీలతోనే కాలం గడుపుతున్నారు తప్ప, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ పనులపై దృష్టి సారించడం లేదు’ అని మండిపడుతున్నారు.ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ముందు రాబోయే భారీ వర్షాకాలంలో మా పరిస్థితి ఏమిటి? అని కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.”ఇప్పటికైనా సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు, పాలకవర్గం స్పందించి.. ఓడిఎఫ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, రోడ్లను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి కాలనీవాసుల కన్నీళ్లే సమాధానం కావాలని వారు కోరుతున్నారు.”

అమీన్‌పూర్‌లో భారీ వర్షాల బీభత్సం: కాలనీల్లో నిలిచిన నీరు, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

0

అమీన్‌పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

రాత్రి కురిసిన భారీ వర్షానికి అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని దినేష్ హోమ్స్ మరియు నారాయణరెడ్డి కాలనీలు జలమయమయ్యాయి. రోడ్ల మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గోడలు కూలిపోగా, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ నవనీత జగదీష్ గారు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించారు. జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపేలా మరియు మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించేలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

*స్థానికులకు భరోసా:*

ఈ సందర్భంగా నవనీత జగదీష్ మాట్లాడుతూ, “భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం పట్ల కాలనీవాసులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశాం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం” అని హామీ ఇచ్చారు.

*అధికారులకు హెచ్చరిక:*

అమీన్‌పూర్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పనిచేస్తున్న ఆమె, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనుల మరియు రోడ్ల నిర్మాణాల పట్ల అసహనం వ్యక్తం చేశారు. “ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పునరావృతమవుతాయి” అని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.ప్రస్తుతం సహాయక బృందాలు రంగంలోకి దిగి నీటిని పంపింగ్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి.

బీరంగూడలో వర్షాల బీభత్సం: అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి వరద నీరు.. జలమయమైన వాహనాలు

0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;

అమీన్ పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

బీరంగూడ డివిజన్ పరిధిలో వర్షాలు అపార్ట్‌మెంట్ వాసుల పాలిట శాపంగా మారాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ నిర్మాణాల కారణంగా ప్రతి వర్షానికి స్థానికులు నరకం చూస్తున్నారు. తాజాగా శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్, నవ్య ప్రైడ్ అపార్ట్‌మెంట్లలో నివాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

*సెల్లార్లలోకి వరద.. మునిగిన వాహనాలు*

సుమారు 36 కుటుంబాలు నివసించే శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అక్కడ పార్క్ చేసిన మూడు కార్లు పూర్తిగా నీట మునిగాయి. మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపేందుకు స్థానికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇక నవ్య ప్రైడ్ అపార్ట్‌మెంట్ వద్ద పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మెయిన్ రోడ్డు పైనుంచి వస్తున్న నీరంతా వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి ఆ నీరు నేరుగా సెల్లార్‌లోకి వెళ్లడంతో ఏకంగా 15 కార్లు నీట మునిగిపోయాయి. 24 కుటుంబాలు నివసించే ఈ అపార్ట్‌మెంట్‌లో అత్యవసర పరిస్థితిలో కూడా బయటకు రాలేని దుస్థితి నెలకొంది.

*అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణమా?*

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు, పాత డ్రైనేజీలను పక్కనపెట్టి నిర్మించిన అక్రమ నిర్మాణాలు నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని నివాసితులు ఆరోపిస్తున్నారు. “ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి వర్షానికి ఇదే తంతు” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లు వచ్చి నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారం లేకపోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తోందని వారు వాపోతున్నారు.

*స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి*

జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి, నాలాలను క్లియర్ చేయించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, తమకు జరుగుతున్న భారీ ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం కళ్ళు తెరిచి, వర్షకాలం ముగిసేలోపు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

అమీన్‌పూర్‌లో జలదిగ్బంధం: సాయిరాం ఫేస్-1, నరేంద్ర కాలనీల వద్ద నిలిచిపోయిన రాకపోకలు

0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;

అమీన్‌పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమీన్‌పూర్ పరిధిలోని సాయిరాం ఫేస్-1 మరియు నరేంద్ర కాలనీ టర్నింగ్ పాయింట్ వద్ద రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లడానికి దారి లేక రోడ్లపైనే నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

*అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం*

ఈ సమస్యపై కాలనీవాసులు మాట్లాడుతూ, “గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అధికారులకు పలుమార్లు విన్నవించినా, వారు కేవలం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న దుర్గా ప్రవీణ్ నగర్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

*జీహెచ్ఎంసీకి హెచ్చరిక*

ఈ సందర్భంగా కాలనీ మాజీ అధ్యక్షులు ఎల్ల స్వామి మాట్లాడుతూ, ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించాలని డిమాండ్ చేశారు. కాలనీల ముంపు సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో త్వరలోనే భారీ స్థాయిలో ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.