📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 14

చెక్ డ్యాంలో గుర్తుతేలియని వృద్దురాలి మృతదేహం లభ్యం..

0
Oplus_16908288

పాపన్నపేట,జూన్,23,మెదక్ టుడే న్యూస్:సుమారు (55) సం రాల వయసు గల ఓ వృద్దురాలి మృతదేహం ఏడుపాయల చెక్ డ్యాం లో లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం చెక్ డ్యాం లో ఓ వృద్దురాలి మృతదేహం గమనించిన స్థానికులు పాపన్న పేట పోలీసులకు సమాచారం అందజేయడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీసి మృతురాలి ఆచూకీ కోసంపరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని. మృతురాలి దేహం పై బ్లూ కలర్ నైటీ తోపాటు, చెవులకు రేడిమెట్ కమ్మలు, ముక్కు పుడక ఉందని. మృతురాలి ఫోటోఆధారంగామృతురాలిని గుర్తించిన వారు పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ చరవాణి 87126 57920, రూరల్ సీఐ కృష్ణమూర్తి 87126 57883 చరవాణి లకు సంప్రదించాలని వారు కోరారు.

శ్రీ వెంకటేశ్వర వీల్స్ ప్రారంభోత్సవం-నూతన వ్యాపార సంస్థను ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్

0

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,జూన్,21,మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ పట్టణంలో మరో నూతన వ్యాపార సంస్థ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వీల్స్ షోరూమ్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇటువంటి సంస్థలు మరిన్ని ఏర్పాటవడం పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో నిర్వాహకులు మరింత అభివృద్ధి సాధించి, వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చలి నరేష్, కొప్పుల ప్రవీణ్, సింగపాగ అనిల్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలు, మెరుగైన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత

0

అమీన్ పూర్, జూన్ 18:

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత , ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన కుమారుడు విదేశాలలో తన డాక్టరేట్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన విషయాన్ని హరీష్ రావు గారికి వివరించి, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన కుమారుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా, ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు గారిని కలవడం జరిగిందని కాట సునీత తెలిపారు. తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఆదరాభిమానాలు చూపే హరీష్ రావు గారిని కలవడం సంతోషాన్నిచ్చిందని, ఆయన అందించిన ప్రోత్సాహం తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాట సునీత గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ తో పోరాటం-స్నేహ హస్తం అందేనా.

0
Oplus_16908288

పాపన్నపేట,జూన్,16,మెదక్ టుడే న్యూస్:చిన్న పిల్లలకు జ్వరం వస్తేనే తల్లితండ్రులు బయపడుతారు లేదా జ్వరం తగ్గేందుకు వైద్యుడికి చూపిస్తారు.అదే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే అ కుటుంబ బాధ వర్ణణాతీతం.మెదక్ జిల్లాలో అరేండ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడడంతో అ కుటుంబానికి దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పాపన్నపేటకు చెందిన మంగళి సాయిబాబ – శోభ దంపతుల కుమారుడు యువన్షు 2024 నుండి మహమ్మారి కాన్సర్ తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధి వైద్యానికి అ కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక,వైద్యానికి తోచినంత తగు సాయం చేసే దాతలు చరవాణి నెంబర్ 8096106545 కు ఫోన్ పే లేదా సంప్రదించాలని తల్లితండ్రులు వేడుకుంటున్నారు .

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన సర్పంచ్,కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి-బాధితురాలు సంధ్య.

0

ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం.

మెదక్,జూన్,15,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన ఆర్. సంధ్య భర్త ఆర్. నవీన్‌కు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామ పెద్దల సూచన మేరకు ఇంటి నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు బాధితురాలు సంధ్య తెలిపారు. కాంట్రాక్టర్ మొదట బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం నిర్మాణ సామగ్రి సరఫరా నిలిపివేసి పనులను అర్ధాంతరంగా ఆపివేశాడని ఆమె ఆరోపించారు.నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ శ్రీధర్ సూచన మేరకే పనులు ఆపివేశామని సమాధానం ఇచ్చినట్లు సంధ్య పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమ కుటుంబం తనకు ఓటు వేయలేదనే కక్షతో ఇంటి నిర్మాణాన్ని నిలిపివేశారని ఆరోపించారు.ఈ విషయమై పలుమార్లు కాంట్రాక్టర్‌ను సంప్రదించినా సర్పంచ్‌ను కలవాలని సూచించారని, అనంతరం సర్పంచ్‌ను కలిసి సమస్య వివరించగా తనను గెలిపించిన 30 మంది అనుమతి ఇస్తేనే ఇంటి నిర్మాణం కొనసాగిస్తానని చెప్పినట్లు సంధ్య తెలిపారు. అంతేకాకుండా పదేపదే తన ఇంటికి రావద్దంటూ హెచ్చరించినట్లు ఆరోపించారు. ఇప్పటికే బేస్‌మెంట్ పనులు పూర్తవడంతో సంబంధిత బిల్లును కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు బాధితురాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి, తమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరారు.అలాగే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసిన సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్ పనులను పూర్తి చేయించి బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.తమ కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను బాధితురాలు సంధ్య వేడుకున్నారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నిలిపివేతపై కలెక్టర్‌కు వినతి.బాధితురాలికి న్యాయం చేయాలి.మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి.ఈ సమస్యపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు.బాధితురాలు సంధ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న పద్మదేవేందర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల ఫలాలను పొందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి,బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

పారిశుద్ధ్య కార్మికులే సమాజానికి నిజమైన సేవకులు-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి.

0

పటాన్‌చెరు,జూన్,14,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి నిజమైన సేవకులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి కొనియాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ (265) పరిధిలోని వెలిమల, సందుగూడెం, వెలిమల తండా ప్రాంతాలకు చెందిన జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆదివారం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాపురం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కార్మికులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “పరిశుభ్రమైన సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించే కార్మికుల సేవలు వెలకట్టలేనివి. వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన మరియు మహిళా నాయకులు, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కాటా సునీత జన్మదిన వేడుకలు.

0
Oplus_16908288

అమీన్ పూర్,జూన్,14,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కాటా సునీత జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కేఎస్‌ఆర్జీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాటా సునీత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ప్రజలే నా బలం: కాటా సునీతఈ వేడుకల్లో పాల్గొన్న కాటా సునీత మాట్లాడుతూ, “ప్రజలు, అభిమానుల మధ్య నా పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నిరంతరం నాపై ప్రేమాభిమానాలను చూపుతున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా వివిధ కాలనీల నుంచి విచ్చేసిన మహిళలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ప్రజల క్షేమమే మా లక్ష్యం

0
oplus_0

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు.

పాపన్నపేట,జూన్,13,(మెదక్ టుడే న్యూస్)మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా పేద ప్రజలకు సేవా చేస్తున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. నీటి సమస్యల పరిష్కారానికి వేల బోర్లు వేసినట్లు ఆయన గుర్తు చేశారు.శనివారం మండలం లోని ఎల్లాపూర్,కుర్తివాడ పలు గ్రామాల్లో బోర్లకు మోటర్లు సామాగ్రి అందజేసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్,ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,కిసాన్ సెల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి,జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు శ్రీధర్, మండలాధ్యక్షుడు నీరుడి వెంకటేశం,జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్,నాయకులు కిష్టయ్య,గౌస్,ఖలీమ్, ముశెట్టి కిష్టయ్య, దోసని సంగమేశ్వర్,కుమ్మరి శంకరయ్య,ఏసు,అంజి, శ్రీశైలం,చోటు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీనాక్షి నటరాజన్ కి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – శాపురం నరసింహారెడ్డి

0

పటాన్ చెరు జూన్ 11

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముత్తంగి డివిజన్ (జిహెచ్ఎంసి-265) నాయకుడు శాపురం నరసింహారెడ్డి పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ అన్ని అవసరమైన పత్రాలను సమర్పించి, ఎటువంటి పెండింగ్ కేసులు లేకపోయినప్పటికీ, స్వల్ప అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. అదే సమయంలో మరో అభ్యర్థికి నిబంధనలలోని లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించడం ఎన్నికల ప్రక్రియలో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా జరగడం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి అభ్యర్థికి ఒకే విధమైన న్యాయం జరగాలని, ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా ఎంపికైన పోలీస్ దిలీప్‌కు జిల్లా ఎస్పీ అభినందనలు.

0

మెదక్,జూన్,11,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ దిలీప్ అగ్నివీర్ పథకం ద్వారా భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్)లో ఎయిర్‌మెన్‌గా ఎంపికైన సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎయిర్‌మెన్ ఎంపికలో 7వ ర్యాంకు సాధించిన దిలీప్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో భారత వైమానిక దళంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాసి మరింత ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. యువతలో చాలామంది వ్యసనాలకు అలవాటుపడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని, అలాంటి వారికి దిలీప్ ఆదర్శంగా నిలుస్తాడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని దిలీప్ నిరూపించాడన్నారు. దిలీప్ సాధించిన విజయం అక్కన్నపేట్ గ్రామంతో పాటు మెదక్ జిల్లాకు గర్వకారణమని, మరెందరో యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉందని ఎస్పీ తెలిపారు. దిలీప్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.