📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 15

మెదక్ ఖి ల్లాకు దేశస్థాయిలో గుర్తింపు తేవాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

0

మెదక్ ఖి ల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.గురువారం మెదక్ కిల్లాను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్ సహకారంతో మెదక్ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ముందుచ్చుతామని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.ప్రజాపాలనప్రగతిప్రణాళికకార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అదనపు కలెక్టర్ నగేష్ ఇతర అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తో మెదక్ ఖిల్లా ను సందర్శించారు.మెదక్ ఖిల్లపైన ఉన్న గజశాల, దర్వాజాలు,జైలును తదితర చారిత్రక అంశాలను కలెక్టర్ ప్రతిమ సింగ్ అడిగి తెలుసుకున్నారు.. మెదక్ ఖిల్ల పైన ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ శిథిలావస్థకు చేరింది అనే అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు..అందులో భాగంగా ఈరోజు ఖిల్లా పైన అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల మొక్కలను, ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.మెదక్ జిల్లాలో దొరికిన పురావస్తు విగ్రహాలు, తదితర శాసనాలు, వివిధ అంశాలతో మెదక్ ఖిల్లపై మ్యూజియంను ఏర్పాటు చేసి మెదక్ జిల్లా చరిత్రను చెప్పే విధంగా పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు.జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద నిధులు తీసుకొచ్చి మెదక్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు… మెదక్ ఖిల్లాపై లెదర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.రాబోవు రోజుల్లో ఖిల్లా పై సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అనువైన ప్రదేశం అని కొనియాడారు.మెదక్ జిల్లా హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు..

కాలనీ వాసుల కష్టాలు తెలిసే వరకు విశ్రమించను: కేసీఆర్ నగర్ పర్యటనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్!

0

అమీన్‌పూర్,జూన్,10,
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో నేరుగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం మరియు వెలుగునివ్వని వీధి దీపాల గురించి ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను ఓర్పుగా విన్న కాట రాజేష్ గౌడ్ , కాలనీ వాసులకు భరోసా కల్పించారు.కాలనీ వాసులకు ఆయన ఇచ్చిన ప్రధాన హామీలు:“మీ కష్టాలు నాకు తెలుసు. మీ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత. తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.”ఈ సమస్యలను వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి మరియు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అధికారులు స్పందించే వరకు నిరంతరం ఒత్తిడి తీసుకువస్తాను” అని హామీ ఇచ్చారు.”రాజకీయాలకు అతీతంగా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే.. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. మీ కుటుంబ సభ్యుడిగా నేను మీ పక్షాన పోరాడుతాను” అని ఆయన పేర్కొన్నారు.ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పని చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్‌రూమ్ కాలనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇతర ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు సృష్టించకండి-స్థానికుల ఆందోళన.

0

రామచంద్రాపురం,జూన్,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల రాకపోకల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన రామచంద్రాపురం బస్ డిపో – బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ‘భెల్’ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం సాగుతున్న పనులను నిలిపివేయడం ఏమాత్రపు సమంజసం కాదని వారు మండిపడ్డారు.గత అరవై ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ రహదారిని విస్తరించేందుకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన కొనసాగుతున్న ఈ పనులను భెల్ అధికారులు అడ్డుకోవడంతో స్థానికులు నిరసనకు దిగారు.స్థానికుల గోడు.. అధికారుల తీరుపై మండిపాటు:ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఈ మార్గాన్నే నమ్ముకుని ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.మద్దతు తెలిపిన నాయకులు:ఈ నిరసన కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, నాయకులు యూనుస్, షౌకత్ అలీతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. రహదారి విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, అధికారులు పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు.

బాల పంచాయతీలతో సురక్షిత గ్రామాలు-బాలల భద్రతకు అందరూ తోడ్పడాలి ఎస్పీ శ్రీనివాసరావు.

0

బాలల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర.

పాపన్నపేట,జూన్,6,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం పాపన్నపేట మండలంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో, మై ఛాయస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి బాల పంచాయతీలు సమర్థవంతమైన వేదికలుగా నిలుస్తాయని అన్నారు. గ్రామాల్లోని బాలబాలికల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేలా బాల పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై బాల పంచాయతీ ప్రతినిధులు దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, బాలల సంక్షేమంలో పిల్లలను భాగస్వాములను చేయడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.బాల పంచాయతీ సభ్యులు గుర్తించిన సమస్యలను అధికారులు సానుకూలంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బాలల అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, డీసీపీఓ నాగరాజు, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీఐడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐ రాజేష్, రూరల్ సీఐ జార్జ్, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్విక, విజన్ ఎన్‌జీఓ ప్రతినిధులు రాజు, యాదగిరి, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, పీఎం శ్రీ పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్, నాయకులు శ్రీకాంత్ అప్ప, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు రాములు, కిష్టయ్య, నాయకులు శివయ్య, సంగమేష్, ప్రసాద్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వివిధ గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

పటాన్ చెరు,జూన్,4,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే , ఆయనకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి జన్మదిన ఆకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… “తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధిలో హరీష్ రావు గారి పాత్ర చిరస్మరణీయం. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషి మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కృష్ణ, బిజిలి రాజు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, తలారి రాములు, కొల్లూరి గోపాల్, కొల్లూరు యాదగిరి, దామోదర్ రెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, ఐలాపూర్ నర్సింగ్ రావు, అనిల్, భాస్కర్ రెడ్డి, లింగం గౌడ్, జ్ఞానేశ్వర్, శ్యామ్, సుధాకర్, రాఘవేంద్ర కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, గోపి, వెంకటేష్, శేఖర్, భూపాల్, నరేందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

చేగుంట నూతన తహసిల్దార్ ను సన్మానించిన మండల జర్నలిస్టులు.

0

చేగుంట నూతన తహసిల్దార్ బాలలక్ష్మి సన్మానించిన మండల జర్నలిస్టులు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తా తహసిల్దార్ బాలలక్ష్మి

చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల నూతన తహసిల్దార్ (ఎమ్మార్వో) గా బాధ్యతలు స్వీకరించిన బాలలక్ష్మిని చేగుంట మండల రిపోర్టర్లు (పాత్రికేయులు) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి నూతన విధుల్లో చేరినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విలేకరులందరూ కలిసి నూతన తహసిల్దార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.తహసిల్దార్ బాలలక్ష్మి దీనికంటే ముందు వెల్దుర్తి మండలంలో ఎమ్మార్వోగా సుదీర్ఘ సేవలు అందించి, బదిలీపై చేగుంట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చేగుంట మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. మండల ప్రగతిలో మీడియా పాత్ర కూడా కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల రిపోర్టర్లు అన్నం మహేష్, సూర్య ప్రకాష్, మొహమ్మద్ ముజామిల్, సతీష్, నడిగొప్ప నాగార్జున, శ్రావణ్ కుమార్, చిక్కుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

చేగుంట ఎన్జీవోస్ కాలనీ 14వ వార్డులో నరకప్రాయంగా మారిన గల్లీ.

0

చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ 14వ వార్డు గల్లీ పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాకాలం ప్రారంభంలోనే ఇక్కడి వీధులు మురుగుకూపాన్ని తలపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి, మోరీల్లోని మురికినీరు, బురద మొత్తం రోడ్డుపైకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నిలిచిన మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల స్థానికులు, వాహనదారులు కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ బురద నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోందని, మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేగుంట మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’గ్రామసభలు.

0

చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేగుంట మండలంలోని మొత్తం 25 గ్రామపంచాయతీలకు గాను, మొదటి విడత కింద గురువారం 6 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సభలకు మండల, గ్రామస్థాయి అధికారులు,సర్పంచులు, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామసభల్లో ప్రధానంగా వర్షాకాలం సన్నద్ధత, సురక్షిత తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ – మన సంరక్షణ, మొక్కల పెంపకం – వన మహోత్సవం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, వరద నిర్వహణ-భద్రత అనే ఏడు రకాల కీలక అంశాలపై ప్రజలతో ముమ్మరంగా చర్చించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎదురయ్యే ప్రత్యేక అవసరాలు, స్థానిక సమస్యల నిమిత్తం ఆయా అంశాలపై గ్రామసభలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం జరిగింది.

ఎం ఆర్ పి ఎస్ యువసేన అధ్యక్షులుగారావూరి రాజు మాదిగ.

0

గుంటూరు,జూన్,3,మెదక్ టుడే న్యూస్:గుంటూరు జిల్లా అంబేద్కర్ భవన్ లో జరిగినవంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం ఆర్ పి ఎస్)వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో శ్రీ రావూరి రాజ్ మాదిగ ను రాష్ట్ర యువజన అధ్యక్షులుగా నియమిస్తూ, ప్రమాణ పత్రాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లాల నాయకులు సమక్షంలో నాయకునిగా నియామక పత్రం అందజేశారు.అనంతరం రావూరి రాజు మాట్లాడుతూ. నాపై నమ్మకంతో, ఎం ఆర్ పి ఎస్, యువసేన అధ్యక్షులుగా నియమించినందుకు, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ,ఎల్లవేళలా అందరికీ తోడుంటూ. ప్రతి సమస్యపై పోరాడుతానని. పేర్కొన్నారు.

డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి.. సీఎంసీ కమిషనర్ సృజన ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్

0

పటాన్ చెరు జూన్ 03, 

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ పరిధిలోని తొమ్మిది డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు.. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసిలో విలీనమయ్యే సమయంలో గల 250 కోట్ల రూపాయల మిగులు నిధులను సైతం డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేయాలని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. 

మంగళవారం గచ్చిబౌలిలోని సిఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సృజనతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. 

ప్రధానంగా మినీ స్టేడియాలు, చెరువులు, స్మశాన వాటికలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. రెండు సర్కిళ్ల పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని.. ఇందుకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విధి దీపాల ఏర్పాటుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ సృజన.. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి 

 జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమై పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపిస్తుందని.. దీని మూలంగా అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కరించాలని సూచించారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలో వరద నీటి సమస్య పరిష్కారానికి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని.. కాలువల నిర్మాణానికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నట్లు జోనల్ కమిషనర్ అమిత్.. ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల రేడియం రోడ్డు లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఉర్జిత్ విల్లాస్ సమీపంలో వరద నీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మినీ స్టేడియాల అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ శంకరయ్య, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.