📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 16

మద్యం,మహిళ వ్యామోహమే కేశవుల ప్రాణాలు తీశాయి.

0

షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్ట్.. పోలీసులకు డీసీపీ శిరీష ప్రశంసలు, రివార్డులు

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,12,మెదక్ టుడే న్యూస్: మద్యం మత్తు, మహిళ వ్యామోహం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించింది. కేవలం జేబులో ఉన్న పదివేల రూపాయల కోసం ఓ మహిళతో కలిసి మరో వ్యక్తి పన్నిన పథకం చివరకు దారుణ హత్యకు దారితీసింది. అయితే ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా విచారించి కేవలం కొద్ది గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు.ఈ కేసులో నిందితులైన పుల్లం గోవిల బజారన్న, బైన్ల యాదమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్ధార్ నగర్‌కు చెందిన కేశవులు శ్రీనివాసరావుకు చెందిన ఫామ్‌హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తన భూమి వివాదానికి సంబంధించిన పని నిమిత్తం యజమాని వద్ద నుంచి రూ.50 వేల తీసుకుని పరిగికి వెళ్లాడు. అక్కడ న్యాయవాదికి రూ.40 వేల చెల్లించి మిగిలిన రూ.10 వేలతో తిరిగి రాత్రి షాద్‌నగర్‌కు చేరుకున్నాడు.
రాత్రి 9:30 గంటల సమయంలో షాద్‌నగర్ బస్టాండ్‌లో దిగిన కేశవులు ఇంటికి వస్తున్నానని భార్య పద్మకు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతంలో కేశవులు మృతదేహం కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల సమీపంలో రక్తపు మరకలతో పడివున్న ఓ షర్టు పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ షర్టు ఆధారంగా నిందితుడు బజారన్నను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు వచ్చిన కేశవులు ముందుగా లక్కీ వైన్స్ వద్ద మద్యం సేవించాడు. అక్కడే అతనికి బజారన్న పరిచయం అయ్యాడు. కేశవుల వద్ద డబ్బులు ఉన్నాయని గుర్తించిన బజారన్న వాటిని దోచుకోవాలని యోచించాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత అక్కడికి వచ్చిన బైన్ల యాదమ్మను చూసి కేశవులు ఆకర్షితుడయ్యాడు. అదే అవకాశంగా భావించిన బజారన్న యాదమ్మతో కలిసి పథకం రచించాడు.
వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి యాదమ్మను కేశవులతో కలిసి వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కేశవులు అప్రమత్తంగా లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యారు.
హత్య అనంతరం బజారన్న గద్వాలకు వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంటి వద్దే అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి రూ.3900 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యాదమ్మను కూడా అరెస్టు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని షాద్‌నగర్ డీసీపీ శిరీష ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆమె రివార్డులు అందజేసి అభినందించారు.

చేగుంట మండల్ కర్నాలపల్లి లోఐ కె.పి కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో ఐకెపి కొనుగోలు సెంటర్ పరిశలించిన రాష్ట్ర, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిరాష్ట్ర రైతు మెంబెర్ భవాని రెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు ఖబడ్దార్ రైతులతో రాజకీయం చేయడం సరికాదు,మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేలా ఉండాలి, కానీ వారితోని మీ నీచ రాజకీయాలు రైతుల వద్ద చేయొద్దని ఈ సందర్భంగా వారు అన్నారు, ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ గానీ,రాష్ట్ర రైతు కమిషన్ కి గాని, లేక రాష్ట్ర సంబంధిత మంత్రులు గాని తెలియ చేయాలి అన్నారు, అనంతరం జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే రెండు రోజుల్లో తలించాలని ఆదేశించారు, ఈ కార్యక్రమం లో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, రెడ్డిపల్లి పిఏసిఎస్ చైర్మన్ మ్యాకల పరమేష్,ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సింలు కాశబోయిన శ్రీనివాస్, అన్నం ఆంజనేయులు, కుర్మ లక్ష్మి, దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్యా,కాసాన్ పల్లి సర్పంచ్ బిక్య నాయక్,చేగుంట ఉపసర్పంచ్ మొహ్మమ్మద్ రఫీ, చందాయిపేట్ ఉపసర్పంచ్ నగేష్ గుప్తా,కర్ణంపల్లి గ్రామ అధ్యక్షులు చింతఆకుల లింగం, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, సినియర్ నాయకులు యాదిరెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్,యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి,సర్పంచ్ బండారి లాలు, బాస రాజు, కొండల్ రెడ్డి, రాజారామ్,వివిధ గ్రామాల సినియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చేగుంట తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన, డీఆర్వో.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట తాసిల్దార్ కార్యాలయాని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ పరిశీలించి, తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున పనులపైన సమీక్ష నిర్వహించారు,వారి కార్యాలయ సిబ్బందికి పలు పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు, ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియను వేగవంతం చేయాలని వారు తెలిపారు, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను త్వర త్వరగా పరిష్కరించాలని, అలాగే సాదా బైనమాలు పనులను కూడా వేగవంతం చేయాలని వారు తెలిపారు, కార్యక్రమంలో చేగుంట ఎమ్మార్వో శివప్రసాద్, ఆరే జయభారత్ రెడ్డి, సర్వేర్ మొగిలయ్య,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,

కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన జుకంటి రాజగౌడ్.

0

చేగుంట,మే,11,మెదక్ టుడే న్యూస్:నూతన కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ గా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసి పూలమాలవేసి శాలువా తో సత్కరించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుకంటీ రాజా గౌడ్, ఈ సందర్బంగా రాజగౌడ్ రాష్ట్రంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్: డీజీకి సమ్మె నోటీసు అందజేత.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా, చేగుంట మండలం, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ( డిసిఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి (ఐపీఎస్) ను మంగళవారం తెలంగాణ రాష్ట్రఫార్మసీ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ తొడుపునూరి రాజు ఆధ్వర్యంలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీఏ ప్రధాన కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల చిరు వ్యాపారులు, రిటైల్ మెడికల్ షాపుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం ( ఏఐఓ సిడి) పిలుపు మేరకు మే 20వ తేదీ బుధవారం నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు సంబంధించిన మెమోరండంను డీజీకి అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల విక్రయాలను అరికట్టాలని, రిటైలర్ల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి.. రిటైలర్లు, హోల్‌సేలర్లకు క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చందాయిపేట్ లోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు నర్సింహా మూర్తి, ఆలయ ధర్మ కర్త పబ్బ శ్రీనివాస్ గుప్త మాజీ ఎంపీటీసీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సుప్రబాత సేవ, మహా గణపతి పూజ, పుణ్యహ వాచనం, పంచామృత అభిషేకం, సింధూర లేపనం, సహస్ర నాగవల్లి దళపూజ (తమలపాకులతో), హనుమత్ హోమం, పూర్ణాహుతి, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, మండలం లో ఉన్న పలు గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా పచ్చని తోరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పబ్బ నగేష్ గుప్త, మని గుప్త, చంద్రమౌళి గుప్తా, శోభన్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదికగా నియామక పత్రం, ఐడీ కార్డు అందజేత.

0

(స్పెషల్ కరస్పాండెంట్)గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ (ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి.) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం నల్లగుట్ట విజయ్ బావమరిది కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుక్కా డానియల్, వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణు మాధవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా, వైస్ చైర్మన్ పి.ఎల్. రవీందర్ నాయుడు, జాతీయ కార్యదర్శి కె.పి. శ్రీనివాస్, స్టేట్ చైర్మన్ యాదవ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ముదిరాజ్ పాల్గొని ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర సభ్యులు రాజేందర్ నల్లారి, శ్రీమతి ప్రీతి, శ్రీమతి లత, ఆనంద్ సతీమణి శ్రీమతి అపర్ణ, శ్రీమతి ఉషా నాయుడు, సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుక్కా డానియల్ మాట్లాడుతూ, “మానవ హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం సాధనలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గోవా రాష్ట్రంలో ఆనంద్ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాం” అని పేర్కొన్నారు.నూతన గోవా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ, వచ్చే నెలలో గోవాలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి, కొత్త కమిటీని ఏర్పాటు చేసి సంస్థ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గోవాలో నిర్వహించబోయే కార్యక్రమాలకు తన సోదరి పార్వతి, బావ విజయ్ కుమార్ నాయుడు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.సంస్థ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ పేర్కొంటూ, గోవాలో సంస్థను మరింత విస్తరింపజేయాలని ఆకాంక్షించారు.

కర్నాల్‌పల్లి కొనుగోలు కేంద్రంలో హరీష్ రావు పర్యటన.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర అసహనం.

0

15 రోజులకు ఒక లారీ వస్తే రైతులు ఏమైపోవాలి?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు.

చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీష్ రావు, ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాల్‌పల్లి కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని, రైతులు కష్టపడి మళ్ళీ ఎండబెట్టినా కొనే నాథుడే లేడని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించలేదని, మంత్రులు జిల్లాల వైపు చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం నిరంతరం శ్రమించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నా ప్రభుత్వం ఢిల్లీ పర్యటనలు, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని, తక్షణమే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

సెల్ఫ్ ఎనిమరేషన్ చేయించుకోవాలి,చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్.

0

చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సెన్సెస్ 2027 మొదటి దశలో భాగంగా మే 11 నుంచి ప్రారంభమయ్యే ఇండ్ల గణన పైన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ వారికి అవగాహన కల్పించారు.అదేవిధంగా సెల్ఫ్ ఎనిమరేషన్ చేసుకోవాలని, ఒక దగ్గర సెన్సెస్ వివరాలు నమోదు చేసుకున్న వారు, మరో దగ్గర నమోదు చేయించుకోవద్దని, సెన్సెస్ వివరాలు పారదర్శకంగా రావాలంటే మీరు చెప్పే సమాధానాల పైన ఆధారపడి ఉంటుందని వారు అన్నారు . ఈ ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ ధనుష్, ఆర్ ఐ జయభారత్ రెడ్డి, ఫీల్డ్ ట్రైనర్ చల్లా లక్ష్మణ్,ఏ ఎస్ ఐ శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్స్ లక్ష్మీపతి, మినా తదితరులు పాల్గొన్నారు.

ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదిక గా నియామక పత్రం, ఐడి కార్డ్ అందజేత.

0


(స్పెషల్ కరస్పాండెంట్)
గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ( ఎన్ హెచ్ ఆర్ ఎస్ జె .సి) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ సంస్థ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆయన సోదరుడి కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ సుక్కా డానియల్, దామోదర్ గుప్తా , పి.ఎల్. రవీందర్ నాయుడు, కె.పి. శ్రీనివాస్, యాదవ రెడ్డి, అశోక్ కుమార్ ముదిరాజ్ పాల్గొని ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర సభ్యులు రాజేందర్ నల్లారి, శ్రీమతి ప్రీతి, శ్రీమతి లత, గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఆనంద్ సతీమణి శ్రీమతి అపర్ణ, శ్రీమతి ఉషా నాయుడు మరియు సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన నూతన గోవా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, వచ్చే నెలలో గోవాలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి, కొత్త కమిటీని ఏర్పాటు చేసి సంస్థ సేవలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందిస్తామని తెలిపారు. మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అదే విధంగా గోవా లో జరుగ బోయే కార్యక్రమానికి తన సోదరి పార్వతి, మరియు తన బావ గారైన విజయ కుమార్ నాయుడు పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నట్లుగా ఆనంద్ తెలిపారు.
సంస్థ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జాతీయ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ పేర్కొంటూ, గోవాలో సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.