📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homeక్రైమ్ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్:జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మండల పరిధిలోని పోడ్చన్ పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ(55) గత కొన్ని రోజులుగా ఫిట్స్, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు.పని చేయుటకు శరీరం సహకరించడం లేదని తరచూ ఇంట్లో బాధపడుతుండే వాడు.ప్రతి రోజు లాగే శనివారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి గదిలోకి వెళ్లాడు.జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కాసేపటికి గమనించిన కుటుంబీకులు కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular