📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన...

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

📰 Generate e-Paper Clip

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, వారి సతీమణి యాదమ్మ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానేత, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, వారి సతీమణి యాదమ్మ గారు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఎమ్మెల్యే గారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి వైవాహిక జీవితం ఇలాగే ఎల్లప్పుడూ ఆనందంగా సాగాలని, నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సత్కార కార్యక్రమంలో అమీన్‌పూర్ జిహెచ్ఎంసి కి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరి చంద్రకళ గోపాల్, ప్రమోద్ రెడ్డి,బోయిని బాలరాజు,మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,చౌటకురి మహిపాల్ రెడ్డి, కొల్లూరి యాదగిరి,దాసు యాదవ్, ఐలాపూర్ నర్సింగ్ రావు… తదితరులు ఉన్నారు.నాయకులంతా ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular