📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 11

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి .

0

ఈనెల .13 నాడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ( ఎన్.డి.డి)

జిల్లాలో 1-19 సంవత్సరాల.1,81,425 మంది పిల్లలు గుర్తింపు

2,36,400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధం

1 – 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్లు వేయించడం .

చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

మెదక్,జులై,10,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)ఈనెల 13 తారీకున నిర్వహించే . జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమా నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గణేశ్వర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 13 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ( నేషనల్ డీ – వార్మింగ్ డే) సంధర్భంగా 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంభందించిన ట్రైనింగ్ లను పి.హెచ్.సి.లలో పూర్తి చేశామని , వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు , కళాశాలలలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవగాహన కల్పిస్తున్నారని, జిల్లాలో1-19 సంవత్సరాల పిల్లలు 181425 ( లక్షా ఎనభై ఒకవేయి నాలుగు వందల ఇరవై ఐదు ) వుండగా 236400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉంచామని , అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడ మాత్రలను పంపించామని, ఉదయం స్కూల్ లో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలకు చేతుల పరిశుభ్రత, అల్బెండజోల్ మాత్రల గురించి తెలియజేయాలన్నారు.
ఈనెల 13వ తేదీన మాత్రలు వేసుకోని పిల్లలకు తేది: 20.07.2026 నాడు మాపప్ కార్యక్రమం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు , ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.అల్బెండజోల్ మాత్ర – కడుపులో పెరిగే నులిపురుగులను నిర్మూలిస్తుంది. పిల్లలలో మంచి ఎదుగుదలతో పాటు చురుగ్గా, మానసిక శారీరక ఆరోగ్యంగా వుంటారు.అల్బెండజోల్ వల్ల పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . నిపుణులైన పిల్లల వైద్యుల సేవలు . అందుబాటులో ఉంచుతున్నామన్నారు.. గోర్లు శుభ్రంగాను, చిన్నవిగా వుండాలని,శుభ్రమైన నీటినే త్రాగాలని,
తినే పదార్థాలపై మూతలు పెట్టాలని, పండ్లు కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలని, భోజనం చేసేముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదన్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలని,పాదరక్షలు ధరించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కడుపులో నులి పురుగులువుంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక మానసిక అభివృద్ధి సరిగ్గా ఉండకపోవడం,ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బలహీనత, బరువు తగ్గడం మొదలైన అనేక సమస్యలు వుంటాయని, నులిపురుగుల నిర్మూలన ( అల్బెండజోల్ మాత్ర ) వల్ల
చదువులు, ఆట పాటల్లో చురుగ్గా వుండడం , మెరుగైన రక్తహీనత, మెరుగైన పోషకాహార స్థితి, పాఠశాలలో మెరుగైన హాజరు ( డ్రాప్ అవుట్ లేకపోవడం) మొదలైన అనేక ప్రయోజనాలు వున్నందున ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వొకేషనల్ కళాశాలలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెస్క్యూ హోమ్స్, లేబర్ , మైగ్రెంట్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ , చైల్డ్ కేర్ హోమ్స్ , అనాధ ఆశ్రమాలు , అంగన్వాడి సెంటర్లు అన్నీ చోట్ల వుండే పిల్లల కోసం ఆక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పర్యవేక్షణ చేస్తున్నామని ,మీ పిల్లలను నులిపురుగుల ( సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మంతీస్ )నుండి రక్షించాలని, 13 తేది నాడు అల్బెండజోల్ మాత్రలు వేసుకోని పిల్లల కోసం 20 వ తేది నాడు మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లా అధికారులు , మీడియా , ప్రభుత్వ , ప్రైవేట్ విద్యా సంస్థలు, తలిదండ్రులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు.

పాపన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి దయనీయ పరిస్థితిపైకప్పు పెచ్చులు ఊడి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం! నూతన ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో.!

0

పాపన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి దయనీయ పరిస్థితి
పైకప్పు పెచ్చులు ఊడి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం! నూతన ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో.
పాపన్నపేట,జూలై 10 (మెదక్ టుడే న్యూస్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం అధ్వాన్న స్థితికి చేరింది. ఆస్పత్రి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతుండగా, వర్షపు నీరు కారడంతో గోడలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణీలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.
భవనంలోని గదుల సీలింగ్‌లో పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు పెచ్చులు ఊడి పడతాయోననే ఆందోళన నెలకొంది. కొన్ని చోట్ల ఫ్యాన్ సమీపంలోనే పైకప్పు దెబ్బతినడం మరింత ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ ఇదే భవనంలో వైద్య సేవలు కొనసాగుతుండటం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు చికిత్స కోసం వచ్చే ఈ ప్రభుత్వ ఆస్పత్రికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, అవసరమైతే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూడకుండా వెంటనే స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏ వి ఆర్ జర్నలిస్టుని పరామర్శించిన చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.

0

చేగుంట,జూన్,8,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన ఏ వి ఆర్ (ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టు రవీందర్ నీ పరామర్శించిన చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ జర్నలిస్టు రవీందర్ గత కొద్ది రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్ అయ్యిది, వారం క్రితం కాలుకి సర్జరీ అయింది విషయం తెలుసుకున్న చేగుంట ఉపసర్పంచ్ రఫీ అతని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. మీరు ఏమి బాధపడకండి తొందరగానే భాగవుతారు అని అన్నారు. మీరు ఏమి బాధపడకండి అని ధైర్యం చెప్పినాడు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫీ తో పాటు, రుక్మాపూర్ ఉపసర్పంచ్ కొలుపుల రామస్వామి, అయిత రఘు రాములు, నడిగొప్ప నాగార్జున, సోమ ప్రవీణ్, స్టాలిన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు

45 లక్షల చోరీ కేసులో కుషాయిగూడ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు.

0
Oplus_16908288

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు నత్తనడకన.?

దొంగల కన్నా ఫిర్యాదుదారులపైనే ప్రశ్నల వర్షం

సీసీటీవీ ఫుటేజ్‌లు ఉన్నా ముందుకు సాగని విచారణపై బాధితుల ఆవేదన

సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

హైదరాబాద్,జులై,8,మెదక్ టుడే న్యూస్:( స్టేట్ బ్యూరో)

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రూ.45 లక్షల చోరీ జరిగిన కేసు దర్యాప్తు తీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, అసలు నిందితులను గుర్తించి సొమ్ము రికవరీ చేసే దిశగా దర్యాప్తు అసలు ముందుకు సాగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితుల వివరాల ప్రకారం డిటెక్టివ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు చోరీకి పాల్పడిన వారిపై దృష్టి పెట్టకుండా, ఫిర్యాదుదారులనే పదేపదే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది.? అనే ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాటికి సంబంధించిన ఆధారాలు సైతం చూపించామని అయినా పదేపదే దానికోసమే మాట్లాడుతూరని బాధితులు పేర్కొంటున్నారు. చోరీ జరిగిన డబ్బును రికవరీ చేయడం, నిందితులను గుర్తించడం వంటి ప్రాథమిక దర్యాప్తు అంశాలను పక్కనబెట్టి, ఫిర్యాదుదారులనే అనుమానితుల్లా ప్రశ్నించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఫిర్యాదు చేసిన లహరి, మహేష్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో దుర్భాషలాడడమే కాకుండా దాడి చేసినట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే బాధితులకు ఇలానే చేస్తారా అని బోరున విలపిస్తున్నారు. మరో బాధితురాలు లహరి, రూ.45 లక్షలు పోయాయన్న ఆవేదనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌లలో అనుమానితుల కదలికలు ఉన్నప్పటికీ, వారిని శాస్త్రీయ పద్ధతుల్లో విచారించి సొమ్ము రికవరీ చేసే దిశగా కనీస చర్యలు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. “నిందితులు తామే చోరీ చేశామని ఒప్పుకోవడం లేదని, అందుకే రికవరీ చేయలేము” అని పోలీసులే చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు పేర్కొంటున్నారు. నేరాన్ని ఛేదించడం పోలీసుల బాధ్యతే తప్ప, నిందితులు స్వయంగా ఒప్పుకుంటేనే కేసు పరిష్కారం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.న్యాయపరంగా చూస్తే, చోరీ జరిగిన కేసులో ముందుగా నిందితులను గుర్తించడం, సాక్ష్యాధారాల ఆధారంగా దర్యాప్తు పూర్తి చేయడం, దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకోవడం పోలీసుల విధి. అనంతరం ఆ సొమ్ముపై చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారించి సంబంధిత ప్రక్రియ ద్వారా బాధితులకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియను పక్కనబెట్టి, ఫిర్యాదుదారులనే పదేపదే విచారించడం వెనుక సీఐ వెంకటేశ్వర్లు ఉద్దేశం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై సీఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా, “సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరిని ప్రశ్నించాం. అయితే వారు డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకోవడం లేదు. అందువల్ల రికవరీ సాధ్యం కావడం లేదు” అని చెప్పినట్లు బాధితులు తెలిపారు. బాధ్యతాయుతమైన పోలీసు అధికారి నుంచి ఇటువంటి సమాధానాలు రావడం ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత అధికారులేమో పోలీసు వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి అని ప్రయత్నిస్తుంటే కిందిస్థాయి అధికారుల తీరు ఇలా ఉండడంతో ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. రూ.45 లక్షలు అనేది భారీ చోరీకి సంబంధించిన ఫిర్యాదు కాబట్టి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యేక శ్రద్ధతో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి రూ.45 లక్షల సొమ్మును రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ఉప్పల్ జోన్ డీసీపీ, మల్కాజ్గిరి పోలీసు కమిషనర్‌ను కోరుతున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం…శిథిలావస్థలో పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి.!

0

-శిథిలావస్థలో పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి.!

-కూలిపోతుందేమోనన్న భయంతో రోగులు.

-ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది.

కొత్త భవనం, నిర్మించాలంటూ ప్రజలు విజ్ఞప్తి.

పాపన్నపేట,జూలై,8,మెదక్ టుడే న్యూస్:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన పాపన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి ) ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ క్షణంలో పైకప్పు పెచ్చులు ఊడిపడి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.ఆసుపత్రి భవనం గోడలన్నీ పగుళ్లతో నిండిపోయాయి. పైకప్పు పూర్తిగా దెబ్బతిని వర్షం పడిన ప్రతిసారి నీరు కారుతోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. చికిత్స కోసం వచ్చే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులు ఆసుపత్రిలోనే భయపడే పరిస్థితి ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు, దుర్వాసన పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా నెలకొంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆసుపత్రే మరోవైపు ఆరోగ్య సమస్యలకు కేంద్రంగా మారుతోందని గ్రామస్తులు అంటున్నారు.ఇద్దరు వైద్యులు ఉండాల్సిన ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఒక్క వైద్యుడే సేవలందిస్తున్నారు. నర్సింగ్, ఇతర సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. తక్కువ మంది సిబ్బందితో వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు అందించడం కష్టసాధ్యంగా మారిందని తెలుస్తోంది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు.స్థానిక ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రధాన విజ్ఞప్తి.పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే కొత్త భవనం నిర్మించాలి.శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత భవనాన్ని వినియోగం నుంచి తొలగించి రోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలి.ఇద్దరు వైద్యులతో పాటు అవసరమైన అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలి.రోగుల ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి.

0

కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి

విద్యార్థుల గోస వినేదెవరు

బీసీ, ఎస్సీ,ఎస్టీ జిల్లా వేల్పర్స్ కూర్చిలకే పరిమితం

యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్

మెదక్,జులై,7,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)జిల్లాలో హాస్టల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా చాలా సమస్యలతో పరిమితమవుతున్నాయని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారుఈ సందర్భంగా ఆయన పది రోజుల పాటు అన్నీ హాస్టలను పర్యవేక్షణ చేయడం జరిగిందని ఇంటర్ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకొని జగన్ మాట్లాడుతూ,బీసీ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందని వంద మంది వుంటే మూడు బాత్రుమ్స్ మాత్రమే వాడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఉదయం రాగిజావ కూడా పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు విపరీతమైన దోమలు కరుస్తున్న వార్డెన్లు పట్టించుకోవడంలేదని ఇప్పటివరకు కూడా దోమతెరలు లేనటువంటి హాస్టళ్ళు ఉన్నాయని ఆయన అన్నారు అపరిశుభ్రంగా హాస్టల్లో వెలబోతున్నాయని ఇంత జరుగుతున్న జిల్లా వేల్పల్స్ మాత్రం కుర్చీలకే పరిమితం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేజీబీవీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి గురుకులాల్లో నీళ్ల చారుతో సరిపెడుతున్నారని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భోజనం అమలు చేయాలని తక్షణమే కలెక్టర్ మేడమ్ అన్నీ హాస్టళ్లను సుడిగాలి పర్యటన గా చేసి సమస్యలు పరిష్కరం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ మెదక్ నగర కార్యదర్శి చరణ్ నాయకులు రాజు, అర్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఒరిజినల్ పాస్పోర్ట్ పోయింది దొరికితే ఇవ్వగలరని విజ్ఞప్తి

0

చేగుంట,జులై,7,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీకి చెందిన పల్లపు పోచవ్వ వైఫ్ ఆఫ్ మల్లేశం గ్రామం రెడ్డి పల్లి కాలనీ మండలo చేగుంట,జిల్లా మెదక్ నా యొక్క పాస్పోర్ట్ ఒరిజినల్ పోయినది. నేను చేగుంట నుండి రెడ్డిపల్లి కాలనీకి ఆటో ఎక్కి ఇంటికి పోతున్నాను, నా యొక్క బ్యాగులు డబ్బులు పాస్పోర్ట్ (ఒరిజినల్) పోయినాయి నా పాస్పోర్ట్ బ్యాగు డబ్బులు ఎవరికైనా దొరికినచో ఇవ్వగలరని నేను కోరుచున్నాను నా యొక్క మొబైల్ నెంబర్ 897730419 ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు దొరికినచో ఇవ్వగలరని కోరుచున్నాను.

మంగళవారం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్య దర్శనం.

0

మంగళవారం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్య దర్శనం.

వెంకంపల్లి – పాపన్నపేట బ్రిడ్జి మంజూరుపై ఎమ్మెల్యే రోహిత్‌కు పాలాభిషేకం.

0

పాపన్నపేట,జూలై,5,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి. దుర్గేష్ గౌడ్
వెంకంపల్లి నుండి పాపన్నపేట వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం లభించడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలంలోని ఆదివారం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ,ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి మంజూరు కావడం స్థానికులకు ప్రయోజకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్ చేసిన కృషి ఫలితంగానే ఈ బ్రిడ్జి మంజూరైందని వారు కొనియాడారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వెంకంపల్లి గోపాల్ పేట–పాపన్నపేట మధ్య రాకపోకలు మరింత సులభతరం అవడంతో పాటు, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, దోసని సంగమేశ్వర్, ముశెట్టి కిష్టయ్య,శ్రీకాంత్ అప్ప, సుంకరి శివయ్య, కలిమ్,ప్రసాద్, శ్రీశైలం, అంజి, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డు మెంబర్లు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

 

ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు

0

ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు

మెదక్ జిల్లా జులై 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం, జూలై 4: పాపన్నపేట మండలంలోని మా పురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబితా–దశరథం దంపతులు, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తై, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించాలని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

జై శ్రీరామ్! జై జై శ్రీరామ్! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం! 🙏