📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 10

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ.

0

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ.

మెదక్,జూలై,17,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

శుక్రవారం వెల్దుర్తి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.వర్షాకాలంలో ఆడపిల్లలు ఆరోగ్యంగా వుండాలని , వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , ఈ సీజన్ లో ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా,మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు విరేచనాలు మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం వుందని, కాబట్టి కలుషిత ఆహారం, నీరు తాగవద్దని, వేడి వేడి ఆహారాన్ని తినాలని, శుభ్రమైన మంచి నీటినే తాగాలని, ఆహార పదార్థాలపై మూతలు తప్పక పెట్టాలని, ఈగలు, దోమలు లేకుండా చూడాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, చేతుల పరిశుభ్రత తప్పక పాటించాలని, జలుబు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవాలని, 14 – 15 సంవత్సరాల మధ్య వున్న అమ్మాయిలు హెచ్.పి.వి. వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని , జిల్లాలో ఇప్పటివరకు 70 % హెచ్.పి.వి. ఇమ్మ్యునైజేషన్ పూర్తిచేశామని, మిగిలిన వారికి కూడా టీచర్లు, తలితంద్రుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని, దీనివల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్, మరియు ఇతర క్యాన్సర్ ఇన్ఫెక్షన్లు రాకుండా ముందస్తుగానే నివారించవచ్చని, మొన్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నాడు అల్బెండజోల్ టాబ్లెట్ వేసుకోని వారు 20 వ తేది నాడు నిర్వహించే మాపప్ కార్యక్రమం రోజున తప్పక తీసుకోవాలని, చదువు కుంటున్న పిల్లలు చదువులు పూర్తి అయ్యేంతవరకు , తమ కాళ్ల మీద సొంతంగా నిలబడే వరకు , కనీసం 21 సంవత్సరాల వయసు దాటిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని, మానసికంగా , శారీరకంగా పూర్తిగా ఎదగని యుక్త వయసులో తొందరపడి పెళ్లి చేసుకోవడం వల్ల శారీరక , మానసిక సమస్యలు చాలా వస్తాయని, రక్తహీనతతో బాధపడుతారని, అలాంటి చిన్న వయసులో గర్భం ధరించడం వల్ల గర్భస్రావాలు జరుగుతాయని, పుట్టబోయే శిశువు కూడా సరైన బరువు లేక అనారోగ్యంతో పుడుతారని, కావున పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని శారీరక మానసిక సమస్యలు కొని తెచ్చుకోవద్దని తెలిపారు.హాస్టల్ రూంలను, వంటలు చేసే సామాగ్రిని, కిచెన్ ను, తాగునీటిని , వాష్ రూంలను, నీరు బయటికి పోయే నాళాలను , పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఫుడ్ పాయిజనింగ్ కాకుండా, దోమలు పుట్టకుండా , కుట్టకుండా , వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ హెడ్ మాస్టర్ , పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు తెలియజేశారు.

కొత్తపల్లికి వస్తూ .. తిరిగిరాని లోకానికి.

0

పాపన్నపేట,జూలై 17, (మెదక్ టుడే న్యూస్)

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కోనగా చికిత్స పొందుతు వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్,కుటింబీకుల సమాచారం మేరకు వివరాలు .. కొత్తపల్లి గ్రామానికి చెందిన బ్యాగారి దుర్గయ్య (75) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగితున్నాడు.గత మంగళవారం ఎల్లపూర్ లో పని ఉందని ద్విచక్రవాహనం మొపేడ్ పై న్యత వెంకటేశం ను తీసుకొని వెళ్లి ఎల్లాపూర్ లో పని ముగించుకొని తిరిగి స్వ గ్రామమైన కొత్తపల్లి వస్తున్న క్రమంలో శానాయిపల్లి గ్రామ శివారులో వెనుకనుండి అతి వేగంగా వచ్చిన టిప్పర్ టి ఎస్ 08యు జె 9679 గల టిప్పర్ లారీ వీరి వాహనాన్ని ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108వాహనం, పోలీసులకు సమాచారం అందివ్వడంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా దుర్గయ్య పరిస్థితి విషమంగా ఉండడం తో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ అమలుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి.

0

మెదక్,జూలై,17(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మెదక్ పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన నూతన మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని మెదక్ పట్టణ టీఆర్ఎస్ కన్వీనర్, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు 40 సంవత్సరాల క్రితం రూపొందించిన పాత మాస్టర్ ప్లాన్‌ల స్థానంలో నూతన మాస్టర్ ప్లాన్‌లు రూపొందించే ప్రక్రియలో భాగంగా, గత పాలకవర్గం మెదక్ పట్టణానికి సంబంధించిన సమగ్ర సర్వేలను పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా, నూతన మాస్టర్ ప్లాన్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మెదక్ పట్టణ అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో కొత్త భవనాలకు నిర్మాణ అనుమతులు జారీ కావడం లేదని, దీంతో ప్రజలు అక్రమ నిర్మాణాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఫలితంగా మున్సిపాలిటీకి రావాల్సిన నిర్మాణ అనుమతి ఫీజులు, ఆస్తి పన్నులు వంటి ఆదాయం కోల్పోయి ఆర్థికంగా నష్టపోతోందని పేర్కొన్నారు.ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పరిధిలో నిర్మించిన భవనాలకు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( బీఆర్ఎస్) ద్వారా పూర్తి స్థాయి అనుమతులు కల్పించాలని, అలాగే మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసి మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌కు త్వరితగతిన ఆమోదం వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణ భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.మామిళ్ల ఆంజనేయులుమెదక్ పట్టణ బిఆర్ఎస్ కన్వీనర్5వ వార్డు కౌన్సిలర్

వనదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే.

0

పాపన్నపేట,జూలై,17,మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాతను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరికేపూడి గాంధీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ అర్చకులు,సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వారికీ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

మనస్థాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

0
Oplus_16908288

పాపన్నపేట జూలై 17 మెదక్ టుడే న్యూస్ :

మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అర్కెల గ్రామంలో శుక్రవారం జరిగింది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…గ్రామానికి చెందిన చిట్యాల ఉదయ్ కుమార్(23) కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నారు.అక్కడ ఉన్న సమయంలో పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాధను ప్రేమ వివాహం చేసుకున్నాడు.గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది.దీంతో అప్పటి నుంచి అతను గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు.ఈనెల 15న భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్లగా ఆమె కాపురానికి రాను అని నిరాకరించింది.ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఉదయ్ కుమార్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.శుక్రవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

0
Oplus_16908288

ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరి దుర్మరణం.. ఒకరికి తీవ్ర గాయాలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఘట్‌కేసర్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన కటికే రషీద్ (42), ఆయన సోదరుడు కటికే గౌస్, పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు (48) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో మేకలు, గొర్రెల వ్యాపారం చేస్తున్నారు. గురువారం రాత్రి తమ వాహనంలో ప్రయాణిస్తుండగా, ఘట్‌కేసర్ సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కటికే రషీద్, డ్రైవర్ రాములు అక్కడికక్కడే మృతి చెందగా, కటికే గౌస్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మృతులు కుటుంబ పోషణ కోసం శ్రమించే వ్యక్తులు కావడంతో వారి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో శోకసంద్రం నెలకొంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నార్సింగి గ్రామంలో 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

0

పాపన్నపేట, జూలై 14 (మెదక్ టుడే): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామానికి ఇప్పటివరకు సుమారు 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరుకాగా, వాటిని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పుంటికూర నారాయణ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వై. నర్సింలు, చాకలి నర్సింలు, వార్డు సభ్యుడు శ్రీరామ్ నవీన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

SIR’ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి.

0

(స్టేట్ బ్యూరో)జులై,11,మెదక్ టుడే న్యూస్:

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి కీలక స్పష్టతనిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వినూత్న సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLO) పంపిణీ చేసే ‘ఎన్యూమరేషన్ పత్రాన్ని’ పూర్తిగా నింపి సమర్పిస్తేనే రాబోయే డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.అర్హులైన ఓటర్లను గుర్తించి, బోగస్ ఓట్లను తొలగించేందుకు దాదాపు 24 ఏళ్ల తర్వాత (చివరిగా 2002లో జరిగింది) చేపట్టిన ఈ భారీ కసరత్తులో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువులోగా ‘ఫామ్-6’ ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదని, ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడం లేదంటూ మీడియా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలపై సీఈఓ సీరియస్‌గా స్పందించారు. బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఫామ్‌లను స్వయంగా అందజేసి, ఓటర్ల వివరాలు సేకరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కరాఖండిగా ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని లోపాలను సరిదిద్దేందుకు పర్యవేక్షకులను (Supervisors) రంగంలోకి దించామని, హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ పూర్తి చేసే అవకాశం ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. ‘పోలీస్ అక్క’తో అవగాహన

0

 

  • మెదక్ జూలై 11 మెదక్ టుడే న్యూస్

మెదక్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు కానిస్టేబుల్ తస్లీమా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాల నుంచి రక్షణ, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాల, ఇల్లు లేదా ఇతర ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.పోలీసులు విద్యార్థుల భద్రతకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, సహాయం అవసరమైన ప్రతి సందర్భంలో నిర్భయంగా ‘పోలీస్ అక్క’ లేదా సమీప పోలీసు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి .

0

ఈనెల .13 నాడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ( ఎన్.డి.డి)

జిల్లాలో 1-19 సంవత్సరాల.1,81,425 మంది పిల్లలు గుర్తింపు

2,36,400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధం

1 – 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్లు వేయించడం .

చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

మెదక్,జులై,10,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)ఈనెల 13 తారీకున నిర్వహించే . జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమా నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గణేశ్వర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 13 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ( నేషనల్ డీ – వార్మింగ్ డే) సంధర్భంగా 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంభందించిన ట్రైనింగ్ లను పి.హెచ్.సి.లలో పూర్తి చేశామని , వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు , కళాశాలలలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవగాహన కల్పిస్తున్నారని, జిల్లాలో1-19 సంవత్సరాల పిల్లలు 181425 ( లక్షా ఎనభై ఒకవేయి నాలుగు వందల ఇరవై ఐదు ) వుండగా 236400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉంచామని , అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడ మాత్రలను పంపించామని, ఉదయం స్కూల్ లో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలకు చేతుల పరిశుభ్రత, అల్బెండజోల్ మాత్రల గురించి తెలియజేయాలన్నారు.
ఈనెల 13వ తేదీన మాత్రలు వేసుకోని పిల్లలకు తేది: 20.07.2026 నాడు మాపప్ కార్యక్రమం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు , ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.అల్బెండజోల్ మాత్ర – కడుపులో పెరిగే నులిపురుగులను నిర్మూలిస్తుంది. పిల్లలలో మంచి ఎదుగుదలతో పాటు చురుగ్గా, మానసిక శారీరక ఆరోగ్యంగా వుంటారు.అల్బెండజోల్ వల్ల పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . నిపుణులైన పిల్లల వైద్యుల సేవలు . అందుబాటులో ఉంచుతున్నామన్నారు.. గోర్లు శుభ్రంగాను, చిన్నవిగా వుండాలని,శుభ్రమైన నీటినే త్రాగాలని,
తినే పదార్థాలపై మూతలు పెట్టాలని, పండ్లు కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలని, భోజనం చేసేముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదన్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలని,పాదరక్షలు ధరించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కడుపులో నులి పురుగులువుంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక మానసిక అభివృద్ధి సరిగ్గా ఉండకపోవడం,ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బలహీనత, బరువు తగ్గడం మొదలైన అనేక సమస్యలు వుంటాయని, నులిపురుగుల నిర్మూలన ( అల్బెండజోల్ మాత్ర ) వల్ల
చదువులు, ఆట పాటల్లో చురుగ్గా వుండడం , మెరుగైన రక్తహీనత, మెరుగైన పోషకాహార స్థితి, పాఠశాలలో మెరుగైన హాజరు ( డ్రాప్ అవుట్ లేకపోవడం) మొదలైన అనేక ప్రయోజనాలు వున్నందున ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వొకేషనల్ కళాశాలలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెస్క్యూ హోమ్స్, లేబర్ , మైగ్రెంట్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ , చైల్డ్ కేర్ హోమ్స్ , అనాధ ఆశ్రమాలు , అంగన్వాడి సెంటర్లు అన్నీ చోట్ల వుండే పిల్లల కోసం ఆక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పర్యవేక్షణ చేస్తున్నామని ,మీ పిల్లలను నులిపురుగుల ( సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మంతీస్ )నుండి రక్షించాలని, 13 తేది నాడు అల్బెండజోల్ మాత్రలు వేసుకోని పిల్లల కోసం 20 వ తేది నాడు మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లా అధికారులు , మీడియా , ప్రభుత్వ , ప్రైవేట్ విద్యా సంస్థలు, తలిదండ్రులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు.