📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homepatancheru political newsఅమీన్‌పూర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే హామీ: కృతజ్ఞతలు తెలిపిన...

అమీన్‌పూర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే హామీ: కృతజ్ఞతలు తెలిపిన పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని పలు అపార్ట్‌మెంట్లలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ మరియు మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి..అమీన్‌పూర్ పరిధిలోని ఆల్ఫా హైట్స్, దర్బార్ అపార్ట్‌మెంట్స్, ఎస్‌ఎస్ హోమ్స్ మరియు భరత్‌నగర్ అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మంచినీటి కనెక్షన్లలో ఉన్న అంతరాయాలను వెంటనే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.సత్వర పరిష్కారానికి చర్యలు:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.అసోసియేషన్ ప్రతినిధుల విన్నపంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అమీన్‌పూర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎమ్మెల్యే సానుకూల స్పందన పట్ల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. తిరుమల రెడ్డి, సభ్యులు భాస్కర్, ఏఎస్ రావు, విష్ణు, విజయ్, మల్లేష్, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular