అమీన్‌పూర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే హామీ: కృతజ్ఞతలు తెలిపిన పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

అమీన్‌పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని పలు అపార్ట్‌మెంట్లలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ మరియు మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి..అమీన్‌పూర్ పరిధిలోని ఆల్ఫా హైట్స్, దర్బార్ అపార్ట్‌మెంట్స్, ఎస్‌ఎస్ హోమ్స్ మరియు భరత్‌నగర్ అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు...