📄 ePaper
Wednesday, August 5, 2026
ADS
HomeTelanganaక్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట-పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట-పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

•బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతన చర్చి ప్రారంభం.

పటాన్ చెరు,మే,22,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతనంగా నిర్మించిన చర్చిని శుక్రవారం ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో చర్చిల నిర్మాణాలు దోహదపడతాయని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ప్రేమ, దయ, క్షమాపణ మరియు నిస్వార్థ సేవలను నేర్పుతున్నాయని తెలిపారు. సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా 30 పైగా చర్చిలు నిర్మించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నూతన చర్చి నిర్మాణానికి సైతం ప్రభుత్వంతో చర్చించి భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. చర్చి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చర్చి ఫాదర్ ఆండ్రూస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular