📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomeTelanganaకొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్...

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు.

📰 Generate e-Paper Clip

రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.

చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి డీసీఎంఎస్, పీఏసీఎస్ పాడి ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లతో పాటు చందాయిపేట్‌లోని శ్రీ శివ కేశవ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ సందర్శించి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పీపీసీ కేంద్రాల సిబ్బందికి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ట్యాబు ఎంట్రీలను ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, అన్‌లోడింగ్ డేటా ఎంట్రీ పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, చేగుంట ఎమ్మార్వో శివప్రసాద్, ఆర్ ఐ జై భారత్ రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, రైస్ మిల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular