కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు.
రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి డీసీఎంఎస్, పీఏసీఎస్ పాడి ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లతో పాటు చందాయిపేట్‌లోని శ్రీ శివ కేశవ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ సందర్శించి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పీపీసీ కేంద్రాల సిబ్బందికి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ట్యాబు ఎంట్రీలను ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు....