📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeNewsన్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవం.

న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవం.

📰 Generate e-Paper Clip


చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:నార్సింగి మండలంలోని న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకలకు స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ అధ్యక్షత వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.డాన్స్ మాస్టర్ గిరిదయ శిక్షణలో అలరించిన విద్యార్థులు ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రముఖ నృత్య దర్శకుడు గిరిదయ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన శిక్షణలో విద్యార్థులు వైవిధ్యమైన పాటలకు స్టెప్పులేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భక్తిరసంతో సాగిన ‘జై జై గణేశా’,ఎల్లమ్మ’ పాటలతో పాటు, భావోద్వేగపూరితమైన ‘అమ్మ పాడే లాలి పాట’, జానపద గీతాలైన ‘పెద్దిరెడ్డి’, ‘చిట్టి అక్క లయ’,’గంగరాజు’ పాటలకు విద్యార్థులు అద్భుతంగా నర్తించారు. అలాగే ‘కళ్ళజోడు కాలేజీ పాప’,’డి జె టిల్లు’ వంటి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో స్కూల్ ఉపాధ్యాయులు మస్రత్, కల్పన, రాణి , ప్రవళిక జ్యోతి , అఫియా, మౌనిక, కృషి ఎంతో ఉందని ప్రిన్సిపాల్ కొనియాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, వారి ప్రతిభను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వేడుకలను పర్యవేక్షించారు.ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ,చదువుతో పాటు విద్యార్థులలో ఉన్న ఇలాంటి కళాత్మక నైపుణ్యాలను వెలికితీసిన డాన్స్ మాస్టర్ గిరిదయ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments