📄 ePaper
Tuesday, September 22, 2026
ADS
Homepatancheru political newsబీరంగూడలో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నదాత నందారం నరసింహ గౌడ్...

బీరంగూడలో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నదాత నందారం నరసింహ గౌడ్ దంపతులు.

📰 Generate e-Paper Clip

బీరంగూడలో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నదాత నందారం
నరసింహ గౌడ్ దంపతులు.

ముదిరాజ్ బస్తీలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాల సంప్రదాయం

వైభవంగా మహా అన్నదానం.. 1,200 మందికి పైగా భక్తులకు భోజనాల

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ముదిరాజ్ సంఘం ఘన సత్కారం

అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామం ముదిరాజ్ బస్తీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ గణనాథుడిని ప్రతిష్టించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా, అందులో భాగంగా భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదానానికి అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ – ఉమారాణి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు.

కార్యక్రమంలో భాగంగా నందారం నరసింహ గౌడ్ దంపతులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తమ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 1,000 నుంచి 1,200 మంది భక్తులు అన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.. సేవా దృక్పథం అందరికీ ఆదర్శం: ముదిరాజ్ సంఘంఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా బస్తీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా భక్తుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్న నందారం నరసింహ గౌడ్ దంపతుల సేవా గుణం ప్రశంసనీయమని కొనియాడారు. వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నరసింహ గౌడ్ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారు రాజకీయంగా మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని భగవంతుడిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే ప్రజాసేవ: నందారం నరసింహ గౌడ్
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. “గత 30 ఏళ్లుగా ముదిరాజ్ బస్తీ పెద్దలు, యువత కలిసికట్టుగా భక్తిభావంతో వినాయక నవరాత్రులను జరపడం ఎంతో సంతోషకరం. గణనాథుడి సేవలో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. ఆ విఘ్నహర్త చల్లని చూపు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు కలగాలని కోరుకున్నాను. ప్రజాసేవే పరమావధిగా భావించి ముందుకు సాగుతున్నానని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు నా వంతు సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తాను” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular