📄 ePaper
Tuesday, September 22, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుపిచ్చిమొక్కల మధ్య ట్రాన్స్‌ఫార్మర్.. ప్రమాదం పొంచి ఉందా?

పిచ్చిమొక్కల మధ్య ట్రాన్స్‌ఫార్మర్.. ప్రమాదం పొంచి ఉందా?

📰 Generate e-Paper Clip

పిచ్చిమొక్కల మధ్య ట్రాన్స్‌ఫార్మర్..ప్రమాదం పొంచి ఉందా?

చేగుంట, సెప్టెంబర్ 21, మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు, తీగలు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. గుబురుగా పెరిగిన పొదల మధ్య ట్రాన్స్‌ఫార్మర్ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో షార్ట్‌సర్క్యూట్‌ లేదా ఇతర విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular