📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomeTelanganaవేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

📰 Generate e-Paper Clip

కొల్చారం,మే,28,మెదక్ టుడే న్యూస్:వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గోడౌన్ నిర్వాహకులను ఆదేశించారు.గురువారం కొల్చారం మండల వరిగుంతం గ్రామంలోని గోడౌను ఆకస్మికంగా తనిఖీ చేశారు.వరి ధాన్యం కొనుగోలు , నిల్వ కోసం ఏర్పాటు చేసిన గిడ్డంగిని పరిశీలించారు.సేకరించిన వరి ధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు ,భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ,ధాన్యం అన్లోడింగ్ త్వరగా జరగాలని, లారీలను, లేబర్ ను అందుబాటులో ఉంచుకోవాలని,అన్లోడింగ్ ఆలస్యం జరగకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్లోడింగ్ లో హమాలీని షిఫ్ట్ ల ప్రకారం పని చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular