వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.
కొల్చారం,మే,28,మెదక్ టుడే న్యూస్:వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గోడౌన్ నిర్వాహకులను ఆదేశించారు.గురువారం కొల్చారం మండల వరిగుంతం గ్రామంలోని గోడౌను ఆకస్మికంగా తనిఖీ చేశారు.వరి ధాన్యం కొనుగోలు , నిల్వ కోసం ఏర్పాటు చేసిన గిడ్డంగిని పరిశీలించారు.సేకరించిన వరి ధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు ,భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ,ధాన్యం అన్లోడింగ్ త్వరగా జరగాలని,...