📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homepatancheru political newsమాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్...

మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ భేటీ.

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,మే,28,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెలంగాణ మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని అమీన్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మాణిక్ యాదవ్ తన నివాసంలో హరీష్ రావు ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ పలకరింపులు జరిపారు.ప్రజా సమస్యలపై చర్చ:ఈ భేటీ సందర్భంగా అమీన్‌పూర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మాణిక్ యాదవ్ మాజీ మంత్రికి వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.దిశానిర్దేశం చేసిన హరీష్ రావు:ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా హరీష్ రావు మాణిక్ యాదవ్‌కు సూచించారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివిజన్ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ పెద్దలు పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి తమ సమస్యలను పంచుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular