📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homepatancheru political newsఅభివృద్ధిలో పటాన్‌చెరు దూకుడు..రూ.3.66 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

అభివృద్ధిలో పటాన్‌చెరు దూకుడు..రూ.3.66 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పర్వం కొనసాగుతోంది. అమీన్‌పూర్ మరియు బీరంగూడ డివిజన్ల పరిధిలో వివిధ కాలనీలు, విలీన గ్రామాల్లో దాదాపు రూ. 3 కోట్ల 66 లక్షల వ్యయంతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తం చేసిన కీలక అంశాలు:మౌలిక వసతులే లక్ష్యం: శరవేగంగా విస్తరిస్తున్న అమీన్‌పూర్, బీరంగూడ ప్రాంతాల్లో ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు లేకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.ప్రజల భాగస్వామ్యం: “స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకుల ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసి, నిధులు కేటాయిస్తున్నాం.పారదర్శకమైన అభివృద్ధి: ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కాలనీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతాం.వసతుల కల్పన: ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు మరియు నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, బిజిలి రాజు, మహాదేవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, తలారి రాములు, ప్రమోద రెడ్డి, చంద్రశేఖర్, జగదీష్, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్,దాసు యాదవ్, లింగం గౌడ్, భాస్కర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్స్ ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి, కాలనీ మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular