📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaనకిలీ కాల్ సెంటర్లపై అప్రమత్తంగా ఉండండి- సైబర్ మోసాలపై పోలీసుల...

నకిలీ కాల్ సెంటర్లపై అప్రమత్తంగా ఉండండి- సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక.

📰 Generate e-Paper Clip

ఓటీపీ వివరాలు పంచొద్దని సూచన

అనుమానాస్పద కాల్స్‌పై జాగ్రత్త

    హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)నకిలీ కాల్ సెంటర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సూచనలు విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ ప్రతినిధుల పేరుతో ఫోన్ చేసి బ్యాంకు, ఉద్యోగం, బహుమతులు, కస్టమర్ సేవల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మి వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం, ఓటీపీలు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. నకిలీ కాల్ సెంటర్ల నుంచి వచ్చే కాల్స్‌లో మోసగాళ్లు ప్రజలను భయపెట్టి లేదా అత్యవసర పరిస్థితి సృష్టించి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలని సూచించారు.
    ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే కాల్‌ను నిలిపివేయాలని తెలిపారు. అవసరమైతే సంబంధిత సంస్థ అధికారిక నంబర్లకు ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

    RELATED ARTICLES
    - Advertisment -ADS

    Most Popular