నకిలీ కాల్ సెంటర్లపై అప్రమత్తంగా ఉండండి- సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక.

ఓటీపీ వివరాలు పంచొద్దని సూచన అనుమానాస్పద కాల్స్‌పై జాగ్రత్త హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)నకిలీ కాల్ సెంటర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సూచనలు విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ ప్రతినిధుల పేరుతో ఫోన్ చేసి బ్యాంకు, ఉద్యోగం, బహుమతులు, కస్టమర్ సేవల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు...