📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homepatancheru political newsరంగంలో 'మిత్ర' బంధం: డాక్టర్లు కృష్ణ దీప్తి, సరిత, శిరీషల...

రంగంలో ‘మిత్ర’ బంధం: డాక్టర్లు కృష్ణ దీప్తి, సరిత, శిరీషల ఆధ్వర్యంలో మిత్ర ఆసుపత్రి ప్రారంభం.

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు; పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం.

అమీన్‌పూర్,మే,4,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తక్కువ ధరకే అందించాలనే గొప్ప లక్ష్యంతో డాక్టర్ కృష్ణ దీప్తి, డాక్టర్ సరిత, డాక్టర్ శిరీషలు స్థాపించిన ‘మిత్ర ఆసుపత్రి’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. గౌరవ అతిథిగా అమీన్‌పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ పాల్గొన్నారు.ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా డాక్టర్లు ముగ్గురు కలిసి ఒక బృందంగా ఏర్పడి, తమ వృత్తి నైపుణ్యాన్ని సమాజ సేవకు వినియోగించడం గర్వకారణమని అన్నారు. బీరంగూడ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రావడం స్థానికులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.నిర్వాహక డాక్టర్లు కృష్ణ దీప్తి, సరిత మరియు శిరీష మాట్లాడుతూ.తమ మిత్ర బృందం అంతా ఒకే తాటిపైకి వచ్చి, వైద్య ఖర్చులు భరించలేని సామాన్యులకు కూడా మెరుగైన చికిత్స అందించాలనే సంకల్పంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించాం.ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య పరికరాలతో పాటు, ఎమర్జెన్సీ వార్డులు, ఓపీ, ఓటీ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.”
“అన్ని విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రోగులకు చికిత్స అందిస్తాం. మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల నరసింహ గౌడ్ మాట్లాడుతూ. స్థానిక నాయకత్వం తరపున ఆసుపత్రికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నందారం రమేష్ గౌడ్, శేఖర్, ఇంద్రేశం జ్ఞానేశ్వర్, మల్లేష్, ఇంద్రేశం ప్రకాష్, శ్యామ్, భరత్ గౌడ్, సందీప్ గౌడ్, వినయ్ గౌడ్,మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments